Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం గందరగోళంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు గాను ఏర్పాటు చేసిన ఈ పథకం ఆగమ్యాగోచరంగా మారింది.
ఎకరం రైతుకు 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని, మొదటి విడతగా 6000 రూపాయలు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎక్కువ భూమి ఉన్న రైతులకు తక్కువ నిధులు, కొంతమంది రైతులకు రైతు భరోసా రాకపోవడం.. రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
అలాంటి వారు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించి.. రైతు భరోసా డబ్బులు అందజేసేందుకు గాను ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండలాలలో వ్యవసాయ కార్యాలయాలలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాలలో ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని రైతు వేదిక నందు. రైతు భరోసా ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేయడమైనది. రైతు సోదరులు రైతు భరోసా పథకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఫిర్యాదు కేంద్రంలో దరఖాస్తు చేసుకోగలరని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి ధీరావత్ సైదా నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమ్య షఫీ, రమేష్ పాల్గొన్నారు.
MOST READ :
- Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
- Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!
- Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!
- Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!









