Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్..!

మన సాక్షి, సూర్యాపేట :

సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎంపీడీవో, ఎంపీవోలతో పాటు పంచాయతీ కార్యదర్శిని సస్పైండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలంలోని చెన్నాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో మరో కొత్త గ్రామపంచాయతీ కిందితండా ఏర్పడింది.

కింది తండా గ్రామంలో ఓటర్ల జాబితాలో అధికారులు వార్డులను సక్రమంగా ఎంపిక చేయలేదని చెన్నయిపాలెం పంచాయితీకి సంబంధించిన 40 ఓట్లను కింది తండాలో చేర్చారని తండాకు చెందిన భూక్య బాబురావు నాయక్ తో పాటు స్థానిక నేతలు గత ఏడాది నవంబర్ 28న ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

స్పందించిన ఎన్నికల కమిషన్ కిందితండా ఓటర్ల జాబితా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఎంపీడీవో కొంతమంది కార్యదర్శులతో నామమాత్రంగా విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

దాంతో మరోసారి స్థానిక నేతలు గత ఏడాది డిసెంబర్ 13న ఫిర్యాదు చేశారు. కాగా ఎన్నికల కమిషన్ మరోసారి విచారణకు డిఎల్పిఓ ఆధ్వర్యంలో ఎంపీడీవో బాణాల శ్రీనివాస్, ఎంపీఓ నరేష్, పంచాయతీ కార్యదర్శి బాల సైదులుతో పాటు మరో పదిమంది కార్యదర్శులతో కింది తండాలో విచారణ చేపట్టారు. అయితే ఓటర్ల జాబితా సక్రమంగానే ఉందని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

ఓటర్ల జాబితా లో మార్పులు, చేర్పులు చేయకుండా తప్పుడు నివేదిక ఇచ్చారని అవకతవకలు జరిగాయని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని 2025 జనవరి 6, ఫిబ్రవరి 8వ తేదీన రెండు పర్యాయాలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కాగా ఎన్నికల కమిషన్ క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించి అధికారుల విచారణలో పంపిన తుది ఓటర్ల జాబితాను పరిశీలించగా అవకతవకలు జరిగాయని భావించింది.

కాగా బాధ్యులైన ఎంపీడీవో, ఎంపీవో, సంబంధిత పంచాయతీ కార్యదర్శి ముగ్గురిని సస్పెండ్ చేయడంతో పాటు మరో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్, రాజా, విజయలక్ష్మి లను ఎంపీడీవో ఆఫీస్ కు అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!
  2. Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!
  3. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!
  4. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

మరిన్ని వార్తలు