Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంవిద్యహైదరాబాద్

Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అందింది. ఇటీవల కాలంలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడటం ఇదే తొలిసారి. ఇంతకాలం పాటు ఉద్యోగాలు లేక ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నది.

మార్చి 1వ తేదీన ఈ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 100 కంపెనీలు, రెండు వేల ఉద్యోగాలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిపుణ సేవ ఇంటర్నేషనల్ సహకారంతో ఈ జాబ్ మేళా కార్యక్రమం జరగనున్నది. ఈ సందర్భంగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ కుమార్ వాల్పోస్టర్ ఆవిష్కరించారు.

ఉద్యోగాలు : 

జాబ్ మేళాలో విద్యార్థులు ఉద్యోగార్దులకు ఐటి, ఫార్మా, ఇంజనీరింగ్ బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్మెంట్ తో పాటు వివిధ రంగాలలో విశేష ఉద్యోగావకాశాలు కల్పించనున్నది. వివిధ రంగాలకు చెందిన 100 కంపెనీలు పాల్గొని రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నది.

అర్హతలు : 

పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, బిటెక్, ఎంటెక్, ఆల్ గ్రాడ్యుయేట్స్, పీజీ, నర్సింగ్, ఫార్మ, 2016 నుంచి 2025 వరకు పూర్తి చేసిన వారు పాల్గొనవచ్చును, వాల్ పోస్టర్లో ఉన్న క్యూఆర్ కోడ్ నెంబర్కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది.

జాబ్ మేళా ఎక్కడ :

మార్చి 1వ తేదీన.. ఉదయం 9 గంటలకు, కెపిహెచ్బి కాలనీ, జే ఎన్ టి యు హైదరాబాద్, హైదరాబాద్లో నిర్వహించనున్నారు.

MOST READ : 

  1. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

  2. TGSRTC : శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త..!

  3. Elections : మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!

  5. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 12 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు..!

మరిన్ని వార్తలు