Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంరాజకీయం

Elections : మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!

Elections : మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!

మన సాక్షి వెబ్ డెస్క్ :

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. తెలంగాణలో 5, ఆంధ్ర ప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు, మార్చి 29వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు, అదేరోజు ఓట్లను లెక్కిస్తారు, ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి మూడో తేదీన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది.

తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, మల్లేశం, మీర్జా హసన్ ఎఫెండి ఆంధ్రప్రదేశ్లో జంగా కృష్ణమూర్తి, రామారావు, అశోక్ బాబు, తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు పదవి కాలం మార్చి 29 తో ముగియనున్నది.

ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఆ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీలు, బిఆర్ఎస్ కున్న ఎమ్మెల్యేలు ఆధారంగా ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఐదు స్థానాలకు టిడిపి, బిజెపి, జనసేన కూటమికే దక్కే అవకాశం ఉంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవి దక్కి అవకాశం లేదు.

MOST READ :

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం..!

  4. BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

  5. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!

మరిన్ని వార్తలు