Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం బంధనలను మార్పులు చేర్పులు చేస్తుంది.
మొదట్లో 400 చదరపు అడుగుల స్థలం ఉండాలని నిబంధనలో తీసుకొచ్చారు. ప్రస్తుతం దాంతో పాటు 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ కూడా ఉండొద్దని నిర్ణయించింది. ఎక్కువ నిర్మాణం చేపడితే ఖర్చు ఎక్కువ అవుతుందనే ఆలోచనలో ఉంది.
అంతే కాకుండా ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నాలుగు రకాల ఇండ్లను నిర్మించుకోవచ్చు అనే వెసులుబాటు కల్పించింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఇంటి నమూనాను ప్రభుత్వం నిర్మిస్తుంది.
మేస్త్రీలకు శిక్షణ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో కూడా ఇవ్వనున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో డిజైన్లను నమూనాలు నిర్మించారు. వాటిలో నాలుగు రకాల డిజైన్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇష్టమైన డిజైన్ లోనే నిర్మాణం చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
నాలుగు డిజైన్ లు :
——— ————–
షార్ట్ కాలం కన్స్ట్రక్షన్ :
ఇది ఇళ్ల నిర్మాణంలో స్టీల్ వ్యయం చాలా ఎక్కువ. దీని వ్యయం తగ్గించేందుకు పునాది స్థాయి వరకు మాత్రమే కాలం ఉంటాయి. పైన ఫ్లింత్ భీమ్స్ ఉంటాయి. మధ్యలో పిల్లర్స్ లేకుండా కాంక్రీట్ గోడలు ఉంటాయి. ఇందిరమ్మ ఇంటి పైన పై అంతస్తు లేకపోవడం వల్ల ఇది అనుకూలంగా ఉంటుంది.
షియర్ వాల్ పద్ధతి :
ఈ పద్ధతిలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ గోడలను నిర్మాణ స్థలంలోనే ముందుగా సాంచాల ద్వారా కాంక్రీట్ తో సిద్ధం చేస్తారు. పునాదులపై డ్రిల్ చేసి కోడలను అనుసంధానం చేస్తారు. వాటి మీద పై కప్పు వేస్తారు. ఇందులో ఇటుక, స్టీల్ ఎలా ఉండదు.
స్టోన్ రూపింగ్ విధానం :
కాంక్రీట్ గోడలు నిర్మించిన తర్వాత పైన పూర్వకాలపు దూలాల మాదిరిగా rcc రాప్టర్స్ ఏర్పాటు చేస్తారు. వాటి మీద షాబాద్ బండలు పరుస్తారు. ఈ బండల మీద తక్కువ మందంతో కాంక్రీటు ద్వారా వేస్తారు. షాబాద్ బండల లభ్యత అధికంగా ఉండే ప్రాంతాలలో ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు.
పిల్లర్ రూపింగ్ నిర్మాణం :
పద్ధతిలో గోడలపై ఆర్ సి సి రాప్టర్లు నిర్మించి పైన బెంగుళూరు పెంకు పరుస్తారు. పెంకు పైన రెండున్నర అంగుళాల స్లాబ్ వేస్తారు. దీనికి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధానంతో ఇటుక స్టీల్ వ్యయం చాలా తక్కువగా అవుతుంది.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!
-
BIG BREAKING : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు..!
-
Hyderabad : నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన తనయుడు..!
-
BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 12 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు..!









