తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే మిల్లర్లపై చర్యలు.. ఎమ్మెల్యే హెచ్చరిక..!

Miryalaguda : యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే మిల్లర్లపై చర్యలు.. ఎమ్మెల్యే హెచ్చరిక..!

మనసాక్షి, మిర్యాలగూడ

యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్క రైస్ మిల్లర్ ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

గతంలో జరిగిన పొరపాట్లను మరోసారి జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

  3. Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు