Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో అమలు అవుతున్న రైతు భరోసా పథకం పై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడతలుగా రైతు భరోసా నిధులు విడుదల చేసింది. అయితే ఈ విషయంపై శుక్రవారం ప్రజాభవన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి తో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. దాంతో పాటు రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాలలో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా గ్రామాల ప్రధాన కూడలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
అదే విధంగా అనంతరం బ్యాంకర్ల సమావేశానికి హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, దానికి బ్యాంకర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. బ్యాంకులకు ఒకేసారి రుణమాఫీ పేరుతో 22 వేల కోట్ల రూపాయలు అందజేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదే అని ఆయన పేర్కొన్నారు.
MOST READ :
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!
-
Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!
-
Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రేషన్ కార్డులు కట్..!









