క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. వాగులో పడి అన్నదమ్ములు మృతి..!
Nalgonda : నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. వాగులో పడి అన్నదమ్ములు మృతి..!
దేవరకొండ, మన సాక్షి
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొన్నది. నియోజకవర్గంలోని చందంపేట మండలం నక్కలగండి తండా సమీపంలోని డిండి వాగులో పడి అన్నదమ్ములు హరి ప్రసాద్ (8), బిట్టు(6) మృతి చెందారు.
శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో ఉన్న అన్న వద్దకు వెళ్తున్న చిన్నారులు, నీటిలోతు తెలియక వాగులోకి దిగి నీట మునిగి మృత్యువాత పడ్డారు. చిన్నారులు ఇంటి వద్ద లేకపోవడం, వాగు ఒడ్డున బట్టలు ఉండడంతో కుటుంబ సభ్యులు వాగులో వెతకగా చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతితో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.
MOST READ :
-
Nalgonda : దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం..!
-
District collector : అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా మెడికల్ ఆఫీసర్ విధులకు గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ షోకాజ్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!
-
Nalgonda : స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత.. పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!









