Suryapet : కంట నీరు పెట్టుకున్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి..!
Suryapet : కంట నీరు పెట్టుకున్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి..!
పెన్ పహాడ్, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని . గాజుల మల్కాపురం, చిన్న గారకుంట తండాలో గ్రామాల్లో శనివారం ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పంట పొలాలను చూసి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంత కండ్ల జగదీష్ రెడ్డి కంట నీరు పెట్టుకున్నారు. ఎండిన పొలాల్లో గొర్రెలు, పశువులకు మెతగా ఇచ్చామని విలపించి రైతులు ఆవేదనతో మాట్లాడుతూ..
కేసీఆర్ పాలనలో మీరున్నప్పుడు ఒక్క ఎకరం ఎండలేదని రైతుల ఆవేదన వెలిబుచ్చినారు.
పుష్కలంగా నీళ్లతో మడికట్లలో చేపలు కూడా పట్టుకున్నామని.. నేడు ఎండిపోలాలను మళ్ళీ చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
మీరే ఏమన్నా చేయాలని జగదీష్ రెడ్డి ని వేడుకున్న రైతులతో పాటు, పెద్దఎత్తున గిరిజన మహిళలు కోరార
మరోచోట పొట్టదశ లో ఉన్న పోలాన్ని కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్ తో నీళ్లు పెడుతున్న రైతును చూసి చలించిపోయారు.
దింపుడుగల్లం ఆశగా ట్యాంకర్ నీళ్లు పెటుకున్నాం సర్ అంటూ ఆవేదన చెందినారు. ఎండిన పంటలు చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు.
అప్పులు తీర్చాల్సిన పంటలను పశువులను మేపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి జగదీష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వనికి రెండు చేతులు జోడించి దండం పెట్టి చెపుతున్నాను. వేసుకున్న పంటలను కాపాడాలన్నారు.
పంటలను ఎండబెట్టి కాంగ్రెస్. రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. ఇచ్చేందుకు నీళ్లున్నా. ఇసుక వ్యాపారానికి పంటలు ఎండబెడుతున్నారు.
కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపమే అన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసీ నష్టపోయామని రైతులు కన్నీళ్ళు పెడుతున్నారు. గోదావరిలో 10 వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం రైతులను ఎండబెడుతున్నారు. ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ ఆన్ చేస్తే పంటలన్నీ పండుతాయి. కాళేశ్వరం మా చేతికి ఇస్తే కేవలం మూడు రోజుల్లో చివరి ఎకరం వరకు నీళ్ళు పారిస్తామని సవాల్ చేసినారు.
ఎక్కడ కేసీఆర్ కి పేరొస్తుందోనని రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీ ఆర్ ఎస్ హయాంలో ప్రతి ఎకరానికి నిరందించాం.
కాంగ్రెస్ ఇసుక వ్యాపార దాహానికి రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఉత్తమ్ కళ్ళు తెరిచి ఉన్న పంటలనైనా కాపాడాలని డిమాండ్ చేసినారు. పంటలు ఎండి గత్యంతరం లేక గొర్ల, పశువులకు మేతకు అమ్ముకుంటున్నరని ఆవేదన చెందినారు.
సమైక్యాంధ్రలో జరిగినట్టు ఇప్పుడు మళ్ళీ రైతులు నష్టపోతున్నారు. పేరుకే నీళ్ళు ఇస్తున్నామని చెబుతున్నా ఎక్కడా పొలాలకు అందడంలేదు అన్నారు. నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ మేత కోసం గొర్లను పంపుతున్నాడని రైతులంటున్నారు.
ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా రైతులకు సాగు నీరివ్వండి. రైతులను చంపకండి. వేడుకుంటున్నానన్నారు.
ఆయన వెంట మాజి ఎంపీపీ నెమ్మది బిక్షం, బి.ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యూగేందర్ సింగిల్ విండో, చెర్మెన్ వెన్న సీతారాం రెడ్డి. నాతల జానకి రాంరెడ్డి, జిల్లా బి.ఆర్ ఎస్ నాయకుడు నిమ్మల శ్రీనివాస్, మాజీ కౌన్సెలర్ షేక్ బాషా, మురిశెట్టి శ్రీనివాస్, తూముల ఇంద్ర సేనరావు,మిర్యాల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు షేక్ షరీఫుద్దీన్, లక్ష్మణ్.దావత్ మోతిలాల్ నాయక్, రైతులు ధారావత్ నగేష్, షేక్ గురక , కొండేటి వెంకటరెడ్డి, గుండు వెంకన్న పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
BIG BREAKING : నేటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే..!
-
Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!









