TOP STORIESBreaking Newsసంక్షేమం

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం వేగవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. 2025 జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం విదితమే. ఆ తర్వాత ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మంజూరు పత్రాలను అర్హులైన వారికి 71,480 మందికి అందజేశారు. వాటిలో ఇప్పటికే కొంతమంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.

అయితే తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 15వ తేదీ నాటికి బేస్మెంట్ లెవలు పనులు పూర్తి చేసిన వారికి వారి ఖాతాలలో ఒక లక్ష రూపాయల చొప్పున జమ చేయాలని నిర్ణయించింది. అందుకోసం 715 కోట్ల రూపాయలు గృహ నిర్మాణ శాఖకు కేటాయించింది. లబ్ధిదారుల నుంచి వివరాలను, ఫోటోలను సేకరించి అధికారులు లిస్టు ఫైనల్ చేస్తారు. ఆ తర్వాత వారికి ఒక లక్ష రూపాయలను ఖాతాలలో జమ చేస్తారు.

ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షలు :

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నది. ఆ నిధులను నాలుగు విడతల్లో అందిస్తారు. లబ్ధిదారులకు వారి వారి ఖాతాలలో జమ చేయనున్నది. బేస్మెంట్ లెవల్ పూర్తయిన తర్వాత ఒక లక్ష రూపాయలు, గోడలు పూర్తయిన తర్వాత 1.25 లక్షల రూపాయలు, స్లాబ్ వేసిన తర్వాత 1.75 లక్షల రూపాయలు, ఇల్లు పూర్తిగా నిర్మించిన తర్వాత ఒక లక్ష రూపాయలు అందించనున్నారు.

MOST READ : 

  1. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  2. Suryapet : చేతికొచ్చే పంట.. పశువుల పాలాయె.. అడుగంటిన బోర్లు, ఎండిన పొలాలు..!

  3. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  5. Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!

మరిన్ని వార్తలు