District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 134 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జ్ మెమో..!
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 134 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జ్ మెమో..!
మన సాక్షి, నల్గొండ :
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 134 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జ్ మెమోలు జారీచేసినట్లు సమాచారం. ఒక్కొక్కరు మూడు నుంచి తొమ్మిది నెలల పాటు అనధికారికంగా సెలవులు పెట్టినట్లు తెలిసింది.
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సమాచారం లేకుండా వ్యవహరించడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పంచాయతీ కార్యదర్శులకు సర్వీసును బ్రేక్ చేస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. 2024 డిసెంబర్ నెలలో కూడా క్రమశిక్షణ పాటించని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ చార్జ్ మెమోలు జారీ చేశారు.
అయితే మరోసారి మెమోలు ఇవ్వడంతో సెక్రటరీలు ఆందోళనలో ఉన్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సాగర్ నియోజకవర్గంలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు క్రీడలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ షాక్.. ఆ పీహెచ్సీ కి వెళ్తే అందరూ ఆబ్సెంటే..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!
-
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!









