Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

జగిత్యాల ప్రతినిధి, (మన సాక్షి)

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రపూర్ గ్రామం , ఎర్రపూర్ తండా, కథలాపూర్ మండలం పోసానిపేట్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల యొక్క స్థలాలను సంబంధిత అధికారులతో కలసి
మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన నమూనా ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం ప్రక్రియ ను పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన వారికి మొదటి దశలో బేస్మెంట్ లేవల్ లో 1 లక్ష రూపాయలు గోడల నిర్మాణం దశలో 1 లక్ష రూపాయలు, స్లాబ్ దశలో 2 లక్షల రూపాయలు, మిగతావి ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని కలర్ వేసిన తరువాత 1 లక్ష రూపాయలు ప్రభుత్వం నుండి కేటాయించబడుతుందని అన్నారు.

గృహ నిర్మాణ మేస్త్రీలు కార్మికులు సకాలంలో ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు సహకారం అందించాలని తెలిపారు.గృహ నిర్మాణ ఇందిరమ్మ యాప్ లో పొందుపరిచే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట డిపిఓ మధన్ మోహన్, డి ఈ హౌసింగ్ ప్రసాద్, ఎమ్మార్వో , ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

  1. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  4. Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

  5. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు