ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్‌పై పెరుగుతున్న నమ్మకం.. ఇన్వెస్టర్లను మరింతగా ఆకర్షిస్తున్న ముమెంటం ఇండెక్స్ ఫండ్స్..!
ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్‌పై పెరుగుతున్న నమ్మకం.. ఇన్వెస్టర్లను మరింతగా ఆకర్షిస్తున్న ముమెంటం ఇండెక్స్ ఫండ్స్..!
ఫ్యాక్టర్ ఆధారిత ఇండెక్స్ ఫండ్స్‌పై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ముమెంటం ఇన్వెస్టింగ్ విధానం మరింతగా ప్రాచుర్యంలోకి వస్తోంది. మ్యుచువల్ ఫండ్స్ నుంచి పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ ఇప్పుడు 31 ఫ్యాక్టర్ ఆధారిత సూచీలను అందిస్తోంది.
ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ముమెంటం, తక్కువ ఒడిదుడుకులు, వేల్యూలాంటి నిలకడగా రాబడులను అందించే అంశాలపై ఆధారితమైనదిగా, చారిత్రకంగా రాబడులపై ప్రభావాలు చూపే నిర్దిష్ట ధోరణులున్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ అనేది నార్మలైజ్డ్ ముమెంటం స్కోరు (Normalized Momentum Score) ఆధారంగా ఎంపిక చేయబడిన నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీలోని టాప్ 50 స్టాక్స్‌ను ట్రాక్ చేస్తుంది.
గత నాలుగు నెలలుగా మార్కెట్ కరెక్షన్లకు లోను కావడంతో పాటు ఒడిదుడుకులమయంగా ఉంటోంది. సంవత్సర వ్యవధిలో అప్పటిదాకా వచ్చిన రాబడులన్నింటినీ తుడిచిపెట్టేసేలా చాలా మటుకు ప్రధాన సూచీలు ఈ వ్యవధిలో ప్రతికూల రాబడులనే నమోదు చేశాయి. మార్కెట్లో స్థిరంగా హెచ్చుతగ్గులు నెలకొన్నప్పటికీ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్స్ మాత్రం పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.
ముమెంటం ఇన్వెస్టింగ్‌కి పెరుగుతున్న ప్రాచుర్యానికి అనుగుణంగా ఉన్న ఫండ్స్‌లో టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్ కూడా ఒకటి. 2024లో డిజిటల్, డైరెక్ట్ మాధ్యమాల ద్వారా ఈ ఫండ్‌లోకి వచ్చే పెట్టుబడులు, 199 నగరాల నుంచి వార్షిక ప్రాతిపదికన మూడింతలై సుమారు రూ. 500 కోట్లకు చేరుకున్నాయి. 2024లో ఢిల్లీలో పెట్టుబడులు సుమారు రూ. 27 కోట్లకు పెరిగాయి. 2023లో నమోదైన దాదాపు రూ. 1.25 కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. కొత్త PAN రిజిస్ట్రేషన్లు కేవలం 15గా ఉండగా 169కి పెరిగాయి.
కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలో కూడా ఇదే తరహలో పెట్టుబడులు రావడం, కొత్త ఇన్వెస్టర్లు చేరడం నమోదైంది. (మూలం: అంతర్గత డేటా)
“భావోద్వేగాలపరమైన పక్షపాత ధోరణులను నివారించి, ధరపరంగా బలమైన ట్రెండ్లను అందిపుచ్చుకోవడం ద్వారా లబ్ధి పొందేందుకు ముమెంటం ఇన్వెస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఒక క్రమశిక్షణతో కూడుకున్న పద్ధతి ప్రకారం ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ చేసేందుకు, రిస్కులు మరియు రివార్డుల మధ్య సమతౌల్యాన్ని పాటించేందుకు టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్ తోడ్పడగలదు.
ట్రాక్ రికార్డు, చారిత్రకంగా సవాళ్లకు ఎదురు నిలబడగలిగే మిడ్‌క్యాప్ స్టాక్స్ స్వభావం కారణంగా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులను అందుకునేందుకు ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఈ వ్యూహానికి కేటాయించే అవకాశాన్ని పరిశీలించవచ్చు” అని టాటా అసెట్ మేనేజ్మెంట్ హెడ్ (ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్) ఆనంద్ వరదరాజన్ తెలిపారు.
2022 అక్టోబర్‌లో ప్రారంభమైన టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌ను Mr. కపిల్ మీనన్ నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్, ముమెంట్ ఆధారిత వ్యూహాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని కోరుకునే ఇన్వెస్టర్లు, టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌ను ఒక ఆప్షన్‌గా పరిశీలించవచ్చు.
ఇవి కూడా చదవండి :
-
Credit : క్రెడిట్ మానిటరింగ్ లో ముందుంటున్న మహిళలు..!
-
Nalgonda : నిమిషం నిబంధన లేదు.. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఇవి తీసుకెళ్లొద్దు..!
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
Suryapet : చేతికొచ్చే పంట.. పశువుల పాలాయె.. అడుగంటిన బోర్లు, ఎండిన పొలాలు..!
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!









