తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఉండదు ఇక.. ఆ స్థానంలో యుడిఐడి కార్డు.. పోర్టల్ పై జిల్లా కలెక్టర్ అవగాహన..!

District collector : దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఉండదు ఇక.. ఆ స్థానంలో యుడిఐడి కార్డు.. పోర్టల్ పై జిల్లా కలెక్టర్ అవగాహన..!

సూర్యాపేట, మన సాక్షి :

దివ్యాంగులకి యూడిఐడి కార్డు జారీ కొరకు ప్రభుత్వ హాస్పిటల్ లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ యూడిఐడి పోర్టల్ పై అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 2025 నుండి సదరం సర్టిపికెట్ స్థానం లో 21 అంగవైకల్యాలకి సంబంధించి యూనిక్ డిజబులుటి ఐడి కార్డు మంజూరు చేయటం జరుగుతుందని యూడిఐడి పోర్టల్ లో లబ్ధిదారులు ప్రత్యేక్షంగా గానీ, మీ సేవ ద్వారా గానీ ధరఖాస్తు చేసుకుంటే చీప్ మెడికల్ అధికారి లాగిన్ కి వస్తుందని తదుపరి స్లాట్ బుకింగ్ కి సంబంందించిన వివరాలు మొబైల్ ద్వారా సందేశం లబ్ధిదారులకి పంపటం జరుగుతుందని తదుపరి అంగవైకల్యం శాతం పరిశీలించి సర్టిపికెట్ ని యూడిఐడి పోర్టల్ లో అప్డేట్ చేసి యూడిఐడి కార్డు లబ్ధిదారుల ఇంటికి స్పీడ్ పోస్ట్ చేయాలని సూచించారు.

యూడిఐడి కొరకు కావాల్సిన టెక్నీకల్ సిబ్బంది, మౌళిక వసతులు పది రోజుల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మాత శిశు సంరక్షణ కేంద్రం నందు ఉన్న గైనకాలజీ పోస్ట్ ఆపరేటివ్ వార్డు లో ఉన్న తల్లులకి,బేబీలకు అందిస్తున్న సేవలను సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. ఒపీ, ఐపీ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు కి సంబందించిన రిజిస్టర్లని పరిశీలించారు.

సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకి వైద్య సేవలు అందించాలని అన్నారు. బ్లడ్ బ్యాంక్, మైక్రో బయాలజీ, పాథలాజీ ల్యాబ్ లను, ఫార్మసి స్టోర్ ను పరిశీలించారు.బ్లడ్ యూనిట్ల వివరాలను అడిగగా 67 యూనిట్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. బ్లడ్ డోనెషన్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఫార్మసిలొ అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని లేని వాటిని ముందుగానే తెప్పించుకోవాలని ఆదేశించారు.

జి జి హేచ్ ఆవరణలో నిర్మిస్తున్న నూతన బిల్డింగ్ ని కలెక్టర్ పరిశీలించారు. బిల్డింగ్ ప్లానింగ్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటే త్వరగా పూర్తి చేయాలని అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరిటీడెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఆర్ యమ్ ఓ జనార్దన్, డాక్టర్ సంధ్య, డాక్టర్ ప్రశాంతి, ఎడి నెహ్రు నాయక్,టి ఎస్ డి యమ్ సి లోహిత్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

  2. District collector : దళారుల నుండి సమస్యలు ఉన్నాయా.. పసుపు రైతులతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..!

  3. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

  4. Fake Doctor : నకిలీ వైద్యుడి గుట్టు రట్టు.. క్లినిక్ సీజ్..!

  5. Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

మరిన్ని వార్తలు