Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలువ్యవసాయం

District collector : దళారుల నుండి సమస్యలు ఉన్నాయా.. పసుపు రైతులతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..!

District collector : దళారుల నుండి సమస్యలు ఉన్నాయా.. పసుపు రైతులతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..!

జగిత్యాల, (మన సాక్షి) :

జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఆరబోసిన పసుపు ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. పసుపులో పలు రకాల ధాన్యం గురించి వ్యవసాయ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. పసుపు ధాన్యం కొనుగోలు ఎలా చేస్తున్నారు. ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్  రైతులతో నేరుగా మాట్లాడారు ఎన్ని ఎకరాలలో పంట వేశారు ఎంత పంట వచ్చిది పసుపు క్వింటాల్ కు మద్దతు ధర ఎలా వుంది అని లాభాలు నష్టాలు రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ రకంగా పసుపు కొనుగోలు చేస్తున్నారు. యాక్షన్ ప్లాన్ వేలం ద్వారా స్వయంగా కలెక్టర్ ప్రత్యక్షంగా చూశారు.

లైసెన్స్ దళారులు కమీషన్ ఏజెంట్ ఏరకంగా పసుపు కొనుగోలు చేస్తున్నారో కలెక్టర్ తెలుసుకున్నారు.
దళారుల నుండి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు.

పసుపు లో 3 రకాలు ఉంటాయని అందులో ఒకటి కాడి రెండవది గోల, మూడవది చూర, అని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.ఇందులో మొదటిది కాడి మంచి రకం పసుపు క్వింటాలుకు మద్దతు ధర 8-10 వెలు ,రెండవది గోల మంచి రకం పసుపు క్వింటాల్ కు 7-8 వేలు ,మూడవది చూర మంచి రకం పసుపుకు 6-7 వేలు మద్దతు ధర ఉందని అధికారులు కలెక్టర్ తెలిపారు.

అలాగే పసుపు కొనుగోలు చేసిన తర్వాత ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని ఆరా తీయగా మధ్యప్రదేశ్  ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుందని అధికారులు కలెక్టర్ తెలిపారు.ప్రస్తుతం రైతులు మంచి పసుపు తీసుకువస్తున్నారు అని అధికారులు అన్నారు.

ఉడకని పసుపు ఉండటం వల్ల ధర తక్కువగా పలుకుతుందని దీనికి కారణం  రైతులకు సరియైన పరికరాలు లేక పోవడం వల్ల ధర కూడా తక్కువగా వస్తుంది అని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.

అనంతరం మార్కెట్ యార్డ్ ఆఫీసు లో  పసుపు అమ్మకాలు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలని ఎలా చేస్తున్నారు స్వయంగా పరిశీలించారు. పసుపు రైతుల మధ్య ధర  సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ రైతులకు తెలిపారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

  2. Tablets : ఈ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. ట్యాబ్లెట్ల తయారీకి జైడస్‌కు గ్రీన్ సిగ్నల్..!

  3. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  5. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!

మరిన్ని వార్తలు