Hyderabad : కుటుంబం ఆత్మహత్యలో సంచలన విషయాలు.. వెల్ సెటిల్ కుటుంబం.. గ్రామస్తులు బయటపెట్టిన వాస్తవాలు..!

Hyderabad : కుటుంబం ఆత్మహత్యలో సంచలన విషయాలు.. వెల్ సెటిల్ కుటుంబం.. గ్రామస్తులు బయటపెట్టిన వాస్తవాలు..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని హబ్సిగూడలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి స్వగ్రామ ముకురాల గ్రామస్తులు సంచలన విషయాలు బయట పెట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం వెల్ సెటిల్ గా ఉన్నారని, వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండకపోవచ్చు అని పేర్కొంటున్నారు.
ముకురాల గ్రామానికి చెందిన కొత్త చంద్రశేఖర్ రెడ్డి (55) 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. మొదట్లో ట్యూషన్ చెప్తూ పలు విద్యాసంస్థలలో లెక్చరర్ గా బోధన చేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశాడు. కొద్ది రోజుల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం బందు చేసి తిరిగి లెక్చరర్ గా విద్యాబోధన చేస్తున్నాడు.
భార్య కవిత (36), కూతురు శ్రీత రెడ్డి(14), కుమారుడు విశ్వ రెడ్డి (09) తో హబ్సిగూడలో నివాసం ఉంటున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో ఎలాంటి అడ్డంకి ఏర్పడిందో తెలియదు.
కానీ ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం హబ్సిగూడలో అద్దెకు ఉంటున్న ఇంట్లో వారు ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భార్య, భర్త గదిలో ఉన్న ఫ్యాన్ కురివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక కారణాలత మరణం చెందినట్లుగా వదంతులు వ్యాపించాయి.
చంద్రశేఖర్ రెడ్డి తోడ నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ముకురాల గ్రామంలో వారికి 80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంతో చంద్రశేఖర్ రెడ్డి పేరున తన గ్రామంలో 15 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా భార్య స్వగ్రామం తాడూరు మండలం పుల్జాల గ్రామం. తల్లి గారి కుటుంబం కూడా చాలా ఉన్నతమైన ఆస్తులు కలిగి ఉన్నవారే.
ఇరువైపుల కూడా ఆస్తులు కలిగి ఉన్నారు. అయినప్పటికీ పిల్లలకు విషమిచ్చి వారు ఉరివేసుకొని బలవరం మరణం ఎందుకు పాల్పడ్డారనే విషయాన్ని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అప్పులు ఉన్నట్లుగా ఏనాడు కూడా వారు చెప్పేవారు కాదని తెలుస్తుంది.
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. సంబంధిత పోలీస్ స్టేషన్లో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !
-
Suspended : డీఈవో సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!
-
Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!
-
Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!









