Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

యూపీఐ ద్వారా కొంతమంది క్రమం తప్పకుండా డిజిటల్ లావాదేవీలు కొనసాగిస్తుంటారు. అలా యధావిధిగా డిజిటల్ లావాదేవీలు కొనసాగాలంటే ఎప్పటికప్పుడు రూల్స్ గమనిస్తూ ఉండాలి. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని ముఖ్యమైన కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. నిబంధనలు ఫాలో కాకుంటే లావాదేవీలు ఆగిపోయే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకుందాం..

2025 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. లావాదేవీల భద్రతను పెంచడానికి కొత్త నియమం ప్రకారం యాక్టివ్ గా లేని లేదా వేరొకరికి అప్పగించబడిన మొబైల్ నెంబర్లను తొలగించాలని NPCI ఈ నిర్ణయం తీసుకుంది.

యాప్ లో ప్రతివారం మూసి వేయడానికి లేదా కొత్త వినియోగదారులకు ఇవ్వబడిన మొబైల్ నెంబర్ల జాబితాని ఎప్పటికప్పుడు రిఫరెన్స్ చేస్తాయి. ఈ ప్రక్రియ తప్పుడు మొబైల్ నెంబర్ తో జరిగే లావాదేవీలను తగ్గిస్తుంది. అంతేకాకుండా భద్రతను కూడా పెంచుతుంది.

ఒకే కస్టమర్ కు రెండు బ్యాంకు ఖాతాలలో ఒకే నెంబర్ ఉండి రెండు బ్యాంకులు ఉపయోగించకపోతే ఆ నెంబర్ తొలగించబడుతుంది. దాంతో యూపీఐ లావాదేవీలు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇతర డిజిటల్ పేమెంట్ యాప్ లు వినియోగించలేరు.

వినియోగదారులు ఏం చేయాలి..?

నెంబర్లు నవీకరించడానికి యుపిఐ అప్లికేషన్లు మీ సమ్మతిని అడుగుతాయి. మీకు ఆప్షన్ లభిస్తుంది. మీ నెంబర్ ను నవీకరించడానికి అంగీకరిస్తే ఈ నెంబర్ నవీకరించబడుతుంది. మీరు మీ నెంబర్ ను అప్డేట్ చేయకపోతే యూపీఐ ద్వారా డబ్బుల లావాదేవీలు చేయలేరు.

నూతన నిబంధనలను అమలు చేయడానికి బ్యాంకులు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన నిబంధనలు అమలులోకి వస్తాయి.

వినియోగదారులకు ప్రయోజనం :

బ్యాంకులో యూపీఐలు వారానికోసారి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేస్తాయి. మోసపూరితమైన విపులమైన లావాదేవీలను తగ్గిస్తుంటాయి. వారికి వినియోగదారులకు భద్రత లభిస్తుంది. నూతన యూపీఐ నిబంధనల ప్రకారం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.

మీరు ఇటీవల మీ నెంబర్ ను మార్చినట్లయితే మీరు దానిని వెంటనే మీ బ్యాంకులో అప్డేట్ చేయాలి. అప్డేట్ లేదా నోటిఫికేషన్లు విస్మరించకూడదు. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి నియామాలలో కూడా మార్పు ఉంటుంది.

Similar News : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

  3. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
  5. UPI : యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే కొత్త రూల్స్ నేటి నుంచే.. తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు