తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : నల్లమల అడవుల్లో ఒక రోజు.. మిర్యాలగూడ విద్యుత్ ఉద్యోగులు..!

Miryalaguda : నల్లమల అడవుల్లో ఒక రోజు.. మిర్యాలగూడ విద్యుత్ ఉద్యోగులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్లమల అడవుల్లో నివసిస్తున్న చెంచు గిరిజన కుటుంబాలకు మద్దతుగా విద్యుత్ శాఖ ఉద్యోగులు ముందుకొచ్చారు. విద్యుత్ బీసీ రాష్ట్ర నాయకులు, సామాజికవేత్త మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్గొండ  జిల్లా మిర్యాలగూడ నుండి ప్రత్యేక సేవ బృందం ఏర్పడి, నల్లమల అడవుల్లో ఒక రోజు కార్యక్రమంలో భాగంగా కొల్లం చెంచుపెంటకు చేరుకుంది.

అమరాబాద్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని ఈ ప్రాంతంలో గిరిజన కుటుంబాలు మౌలిక వసతుల లేకుండా జీవనం సాగిస్తున్న సంగతి తెలుసుకుని, విద్యుత్ శాఖ రెవెన్యూ ఉద్యోగి కళ్లెం శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధ్యతగా ముందుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగులు ప్రతి కుటుంబానికి దాదాపు ₹5,000 పై విలువైన వంటకు సంబంధించిన స్టీల్ సామాన్లు, బిందెలు, బకెట్లు, గిన్నెలు, చేనేత దుస్తులు, దుప్పట్లు అందజేశారు.

ఈ సేవా కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బంగారు రవికుమార్, మల్లోజు పాండురంగ, ఎక్కల శెట్టి కృష్ణ, కుక్కల సతీష్, రాజశేఖర్, కుసుమ విజయ, రాధిక, అరుణ్ కుమార్, గడేరాజు వెంకటేష్, సర్వేశ్వర్, అశోక్, భాస్కర్, అరుణ్ కుమార్, కుసుమ విజయ, గూడూరు శ్రీలత, రామకృష్ణ, గుడిసెల ప్రభాకర్, నాగరాజు, కోటేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.

“చెంచు గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తాం” అని విద్యుత్ శాఖ సేవా బృందం పేర్కొంది.

MOST READ : 

  1. Nalgonda : టాస్క్ ఫోర్స్ పోలీసుల విస్తృత దాడులు.. నకిలీ మద్యం గుట్టురట్టు..!

  2. Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!

  3. Groups : ఆర్టీసీ ఉద్యోగుల కూతుళ్ళు.. డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపిక..!

  4. Bank Rules : మారిన బ్యాంకు రూల్స్.. నేటి నుంచే అమలు.. తెలుసుకోకుంటే నష్టమే..!

మరిన్ని వార్తలు