Nalgonda : పల్లెనిద్రలో ASP.. కేసులు, చట్టాలు, విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ పట్ల అవగాహణ..!
Nalgonda : పల్లెనిద్రలో ASP.. కేసులు, చట్టాలు, విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ పట్ల అవగాహణ..!
కొండమల్లేపల్లి, మనసాక్షి :
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెన్నంనేనిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి దేవరకొండ ఏఎస్పి మౌనిక పల్లె నిద్రలో పాల్గొన్నారు. పోలీసింగ్ భద్రత, కేసులు, చట్టాలు పట్ల ప్రజలకు ఏఎస్పీ అవగాహన కల్పించారు.
ఈనెల 5వ తేదీన నల్గొండలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జాబ్ మేళా ను వినియోగించుకోవాలని నిరుద్యోగులను కోరారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న జాబ్ మేళాలో నిరుద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొనేలా తల్లిదండ్రులు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ పోలీస్ ను ఏర్పాటు చేశామని, గ్రామస్తులు ఏమైనా సమస్యలు ఉంటే విలేజ్ పోలీస్ ను సంప్రదించాలని సూచించారు.
ఎప్పటికప్పుడు గ్రామస్తులు అప్రమత్తతో కూడి ఉండాలని, అపరిచితులు ఎవరైనా ఎదురైనప్పుడు పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని గ్రామస్తులు సూచించారు. చట్టాల పట్ల, ఎస్సీ, ఎస్టి కేసులపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, మాదక ద్రవ్యాలు మద్యం ఇతర వ్యసనాలకు యువత అలవాటు కాకుండా జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి, మాజీ ఎంపీపీ, గ్రామ మాజీ సర్పంచ్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
MOST READ :
-
Job Mela : 4న జాబ్ మేళ.. పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు..!
-
Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!
-
Childrens Death Case : గెట్ టు గెదర్ ఎంత పని చేసింది.. పెరుగన్నం తినకుండా బతికిపోయిన చంద్రయ్య..!
-
Bank Rules : మారిన బ్యాంకు రూల్స్.. నేటి నుంచే అమలు.. తెలుసుకోకుంటే నష్టమే..!
-
Summer Tips: ఎండాకాలంలో వేడి నీళ్ల స్నానం మంచిదేనా..!










