Paddy Centers : కొనుగోలు కేంద్రాలలో ధాన్యంకు మద్దతు ధర.. రూ.500 బోనస్ పొందండి..!
Paddy Centers : కొనుగోలు కేంద్రాలలో ధాన్యంకు మద్దతు ధర.. రూ.500 బోనస్ పొందండి..!
మాడుగులపల్లి, మన సాక్షి :
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పి. శ్రవణ్ కుమార్ తెలియచేసారు.. మాడుగులపల్లి మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి తేమ శాతన్ని పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వం వరి A గ్రేడ్ రకానికి క్వింటాల్ కి రూ 2320/- గాను, సాధారణ రకానికి రూ 2300/- గాను కనీస మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని ఆయన తెలియచేసారు. అంతే కాక తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన సన్న ధాన్యానికి ప్రోత్సహకంగా క్వింటాల్ కి రూ 500/- లు బోనస్ ప్రకటించడం జరిగిందని ఆయన తెలియచేసారు.
కావున రైతులందరు కూడా కనీస మద్దతు ధరను పొందాలంటే తప్పనిసరిగా నాణ్యత ప్రమాణలను పాటించాలని తేమ శాతం 17% ఉండేవిధంగా, వడ్లలో తాలు లేకుండా చూసుకోవాలని ఆయన తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి యం.శివరాం కుమార్ ,వ్యవసాయ విస్తరణ అధికారులు జి. శిరీష, వేణుగోపాల్, పార్వతి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Hyderabad : హైదరాబాద్ నగరంలో దంచికొడుతున్న వర్షం..!
-
Viral Video : ముగ్గురు పిల్లలను చంపిన కిలాడి, ఆమె ప్రియుడు.. (వీడియో వైరల్)
-
Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
Health : ఎండు చేపలా, పచ్చివా.. ఆరోగ్యానికి ఏవి మంచివి, గుండె జబ్బు వారికి..!
-
Miryalaguda : పేదల ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!









