Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

Viral Video : ముగ్గురు పిల్లలను చంపిన కిలాడి, ఆమె ప్రియుడు.. (వీడియో వైరల్)

Viral Video : ముగ్గురు పిల్లలను చంపిన కిలాడి, ఆమె ప్రియుడు.. (వీడియో వైరల్)

మన సాక్షి, వెబ్ డెస్క్:

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది ఓ కన్నతల్లి. పోలీసుల విచారణ అనంతరం ఆమెని ఆమె ప్రియుడిని గురువారం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

వివరాల ప్రకారం ప్రియుడి మోజులో పడి రజిత అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. అయితే ఆమెతో పాటు ఆమె ప్రియుడు శివను కూడా సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మర్చి 27న సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ముగ్గురు పిల్లలతో పాటు తన భర్త చెన్నయ్య ను చంపాలని ప్రియుడు శివతో కలిసి కుట్రలు చేసింది. అయితే ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషయం కలిపింది. భర్త పెరుగన్నం తినకుండా పప్పుతో తిని బతికిపోయాడు.

కాగా కలుషిత ఆహారం తినడం వల్ల అలా జరిగిందని అనుమానం రాకుండా కడుపునొప్పి నాటకం ఆడి ఆసుపత్రిలో చేరింది రజిత. ఆమె భర్త చెన్నయ్య కు అనుమానం రాకుండా ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయాన్ని తెలుసుకుని రజితను, ఆమె ప్రియుడు శివను అరెస్టు చేశారు.

MOST READ :

మరిన్ని వార్తలు