Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsతెలంగాణసంగారెడ్డి జిల్లా

TG News : తీవ్ర విషాదం.. నిద్రలోనే ముగ్గురు పిల్లలు మృతి.. తీవ్ర అస్వస్థతతో తల్లి..!

TG News : తీవ్ర విషాదం.. నిద్రలోనే ముగ్గురు పిల్లలు మృతి.. తీవ్ర అస్వస్థతతో తల్లి..!

మన సాక్షి, సంగారెడ్డి :

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలు నిద్రలోనే మృతి చెందారు. తల్లి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ హృదయ విదారకమైన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రాఘవేంద్ర నగర్ కాలనీలో చోటుచేసుకుంది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు నిద్రలోనే మృతి చెందడంతో పలు అనుమానాలకు భావిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య అతని భార్య రజిత అమీన్‌పూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ (12) మధుప్రియ (10) గౌతమ్ (8) ఉన్నారు.

చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుటుంబం అంతా కలిసి భోజనం చేశారు. చెన్నయ్య అన్నం పప్పుతో భోజనం చేశాడు. రజిత ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నారు. భోజనం చేసిన తర్వాత చెన్నయ్య తన పనికి వెళ్ళాడు. రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చాడు. అప్పటికే పిల్లలు నిద్రిస్తున్నారు. రజిత చెన్నయ్య కోసం మెలకువతో ఉంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు రజితకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆమెను చెన్నయ్య హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు.

ఆమె చికిత్స పొందుతుండగా ఇంటికి వచ్చిన చెన్నయ్య కు పిల్లలు ముగ్గురు మరణించినట్లు తెలిసింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. అయితే పోలీసులు చెన్నయ్య పెరుగన్నంలో విషయం కలిపి హత్య కు ప్రయత్నించాడా..? అనే కోణంతో పాటు తల్లి ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడిందా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

చెన్నయ్య రజిత మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు పేర్కొంటున్నారు. చెన్నయ్య కు రజిత రెండవ భార్య. ఈ ముగ్గురు పిల్లలు కూడా వారి సంతానమే. ఏం జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

MOST READ :

  1. Electricity Bill : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జారీ చేసిన CMD..!

  2. TG News : తెలంగాణలో మరో పరువు హత్య..!

  3. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  4. Bettings : గుట్టు చప్పుడు కాకుండా.. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్..!

  5. Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!

  6. UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!

మరిన్ని వార్తలు