Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsసంక్షేమం

Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!

Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!

తెలంగాణ బ్యూరో, మన సాక్షి :

తెలంగాణ లో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పేదలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నది. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడం వల్ల పేదలు కనీసం నిత్యవసర సరుకులు కూడా అందుకోలేని పరిస్థితి వచ్చింది.

కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఆ తర్వాత గ్రామ సభలు, మీసేవ కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులను దరఖాస్తులను స్వీకరించడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను కూడా కొత్తవారిని చేర్చారు.

ఇదిలా ఉండగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏప్రిల్ నుంచి కొనసాగుతుందని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి శుభవార్త తెలిపారు. కాగా కొత్త రేషన్ కార్డులు మంజూరైన వాళ్లకు కార్డులు రాకపోయినప్పటికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్ షాపుల్లో వారికి నిత్యవసర సరుకులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు.

తెలంగాణలో ప్రస్తుతం 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇటీవల కొత్త దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దాంతో పాటు కుటుంబ సభ్యుల జాబితాలో కూడా చేర్పులు, మార్పులు చేశారు.

దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల సుమారుగా 80% మంది వాటిని ఉపయోగించడం లేదు. దాంతో పక్కదారి పడుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం పేదలు కడుపునిండా తినేలా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఉగాది నుంచి ప్రారంభం కానున్నది. దాంతోపాటు కొత్త రేషన్ కార్డుల జారీ కూడా చేయనున్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. యువ వికాసం పథకానికి మీరు అర్హులేనా..!

  2. District collector : నిబంధనలు అన్నీ ఉంటేనే లేఔట్లకు అనుమతులు.. జిల్లా కలెక్టర్ స్పష్టం..! 

  3. TG News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. యువ వికాసం పథకానికి మీరు అర్హులేనా..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!

  5. Property Tax : ఆస్తి పన్ను పై అదిరిపోయే ఆఫర్.. 90% మాఫీ..!

మరిన్ని వార్తలు