Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsహైదరాబాద్

Electricity Bill : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జారీ చేసిన CMD..!

Electricity Bill : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జారీ చేసిన CMD..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

విద్యుత్ వినియోగదారులకు తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, (CMD) చైర్మన్ ముషారఫ్ ఫరూఖీ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. విద్యుత్ వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వివరాలను ఎవరికి చెప్పవద్దని, విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని కోరారు.

సైబర్ నేరగాళ్లు విద్యుత్ వినియోగదారులకు ఫేక్ మెసేజ్ లు పంపుతున్నట్లు తమ సంస్థ దృష్టికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వాటిలో గత నెల విద్యుత్ బిల్లు చెల్లించనందున రాత్రి 7:30 తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, బిల్లు చెల్లించడంలో సమస్యలు ఉంటే వెంటనే వాట్సప్ లో సంప్రదించాలని పేర్కొన్నారు.

ఇది నిజమేనని నమ్మి పలువురు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు తెలిపారు. తాము విద్యుత్ శాఖ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వివరాలను సేకరించి బ్యాంక్ అకౌంట్ నుంచి భారీగా డబ్బులు డ్రా చేసినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

TGSPDCL ఎప్పుడు మొబైల్ నెంబర్ ల నుండి సందేశాలను, లింకులను పంపదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యుత్ బిల్లులు బకాయిలు ఉంటే రాత్రిపూట కరెంట్ సరఫరా నిలిపివేయమని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా తమ సంస్థ వెబ్సైట్ www.tgsouthernpower.org లేదా TGSPDCL మొబైల్ యాప్ ద్వారా తెలుసుకొని పరిష్కరించుకోవాలని కోరారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

MOST READ :

UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

PM Vidya Lakshmi : విద్యార్థులకు ఆర్థిక భరోసా.. పీఎం విద్యాలక్ష్మి.. దరఖాస్తులు ప్రారంభం..!

Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!

TG News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. యువ వికాసం పథకానికి మీరు అర్హులేనా..!

మరిన్ని వార్తలు