తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిల్లర్లకు సబ్ కలెక్టర్ హెచ్చరిక.. ధాన్యం కింటాకు రూ.2300 లకు కొనుగోలు చేయకుంటే చర్యలు..!

Miryalaguda : మిల్లర్లకు సబ్ కలెక్టర్ హెచ్చరిక.. ధాన్యం కింటాకు రూ.2300 లకు కొనుగోలు చేయకుంటే చర్యలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కింటాకు రూ 2,300 తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ హెచ్చరిక చేశారు. శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో రైస్ మిల్లర్స్ తో నిర్వహించారు.

సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ మిల్లర్లు అన్ని రకాల ధాన్యంతో పాటు హెచ్ఎంటి ధాన్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్నారు. రైస్ మిల్లుల వద్ద వేయింగ్ మిషన్లలో ధాన్యం వ్యత్యాసం వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎట్టి పరిస్థితులలో వేయింగ్ మిషన్లు వ్యత్యాసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా మిల్లు యజమానులు తమ మిల్లు సామర్థ్యం కు మించి వచ్చిన ధాన్యం ట్రాక్టర్ల లోడును సమీపంలోని మిల్లులకు పంపాలన్నారు. మిల్లర్లు తమ మిల్లుల వద్ద కెపాసిటీ మించి వచ్చే దాన్యం లోడ్లలతో వస్తున్నందున రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లుల వారిగా టోకెన్లు, తేదీల వారిగా ఇవ్వాలన్నారు.

ప్రతి రైస్ మిల్లు కష్టం మిల్లింగ్ కోసం తన కెపాసిటీలో 50 శాతం తప్పనిసరిగా ప్రతిరోజు ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యము కొనుగోలు చేసిన మిల్లర్లు రైతులకు త్వరితగతిన డబ్బులు చెల్లించాలన్నారు. రైస్ మిల్లుల వద్ద మంచి నీటి సౌకర్యంతో పాటు, వేసవికాలం దృష్ట్యా నీడలో కూర్చోనే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమావేశంలో తహసిల్దార్ హరిబాబు, సురేష్, జవహర్ లాల్, సివిల్ సప్లై డిటి జావిద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గంట సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, డాక్టర్ బండారు కుశలయ్య, గుడిపాటి శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, తదితర రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : భూ నిర్వాసితులకు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. సబ్ కలెక్టర్ కు సన్మానం..!

  2. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!

  3. Miryalaguda : బలంపియాడ్ పరీక్షలో సెయింట్ జాన్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు.!

  4. Gold Price : ఒక్క రోజే కుప్పకూలిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు