Miryalaguda : బలంపియాడ్ పరీక్షలో సెయింట్ జాన్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు.!
Miryalaguda : బలంపియాడ్ పరీక్షలో సెయింట్ జాన్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు.!
మిర్యాలగూడ, మన సాక్షి :
సుచిరి ఇండియన్ ఫౌండేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో మిర్యాలగూడ కు చెందిన సెయింట్ జాన్స్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
రాష్ట్ర స్థాయి లో 3 వ ర్యాంక్, జిల్లా స్థాయిలో వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని కె. దీపిక , రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, జిల్లా స్థాయిలో 2 వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఆ. కీర్తన, రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్, జిల్లా స్థాయిలో 3 ర్యాంక్లు సాధించిన విద్యార్థిని ప్రసన్న 1500/- విలువ గల బహుమతులు గెలుపోందారు.
వారితో పాటు పాఠశాల నందు 88 మంది విద్యార్థులు 85% తో మెరుగైన ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాన్రెడ్డి, విద్యార్థులను సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
విద్యార్థులకు పాఠ్య పుస్తకాల విద్యతో పాటు, ప్రతిభకు సంబంధించిన పోటీ పరిక్షల్లో మెరుగైన ప్రతిభ కనపర్చడానికి ఎల్లప్పుడూ, విద్యార్థులను అన్ని రంగాల్లో పాల్గోనే విధంగా మా పాఠశాల ముందుంటుందని అన్నారు.
ఇలాంటి కార్య క్రమాల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, పోటీ తత్త్వం మెరుగు పడుతాయని పాఠశాల కరస్పాండెంటి అలుగుబెల్లి శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
MOST READ :









