తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మున్సిపల్ కార్మికులకు తోడుగా ఉంటా.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!

Miryalaguda : మున్సిపల్ కార్మికులకు తోడుగా ఉంటా.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటానని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు కాస్మొటిక్ కిట్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నాకు సాధ్యమైనంత వరకు మీ అందరి సమస్యలు తీర్చేందుకు నేను కృషి చేస్తానని అన్నారు.

అలాగే మీరు కూడా తమ విధుల నిర్వహణలో బాధ్యతగా ఉంటూ మిర్యాలగూడ పట్టణ పరిశుభ్రతకు స్వచ్ఛదనానికి కృషి చేయాలని అన్నారు. తమ పనులను బాధ్యతగా నిర్వర్తిస్తే నేను మీ వెంటే ఉంటూ మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. తమకి అందాల్సిన కాస్మోటిక్స్ కానీ, పెండింగ్ లో ఉన్న జీతాలు, ఇతర బిల్లులు అన్ని రిలీజ్ చేయించి మీకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది

అదేవిధంగా మున్సిపల్ కార్మికుల్లో గానీ సిబ్బందిలో గానీ పనులు చేయకుండా బాధ్యతా రహితంగా ఉంటే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని రద్దీగా ఉంటే ప్రధాన ప్రాంతాలు బస్టాండ్, మార్కెట్, డాక్టర్స్ కాలని ఇతర ప్రదేశాలలో పరిశుభ్రంగా లేకపోయినా అక్కడి సిబ్బంది పై తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దాదాపు 14 సంవత్సరాల తరువాత ఎంఎల్ఏ సూచనల మేరకు మున్సిపల్ కార్మికులకు కాస్మొటిక్ కిట్ అందజేయాలి అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే మున్సిపాలిటీలో 60 ఏళ్ల వయసు దాటిన వారికి విరమణ ఇస్తూ వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని అనే నిర్ణయాన్ని కూడా సూచించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, డీఎస్పీ రాజశేఖర్ రాజు, మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. DMHO : ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. డిఎంహెచ్ఓ వెల్లడి..!

  2. Axis Bank: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. ఓటీపీ మోసాలకు ఇక చెక్..!

  3. Health Report: పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు..!

  4. TG News : పండుగ వేళ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  5. Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!

మరిన్ని వార్తలు