Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. రాష్ట్రంలో పేదలకు సొంతింటి కల నెరవేరనున్నది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ తొలి విడతలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ షురూ చేసింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా చేపట్టింది.
తొలి విడతలో నిరుపేదలైన వారికి మాత్రమే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వారికి మొదటి విడతగా చెక్కులను పంపిణీ చేసింది. మంగళవారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో సీఎల్పీ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల చెక్కులను కూడా పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను పంపిణీ చేశారు. మొట్టమొదటి చెక్కు దేవరకద్ర కు చెందిన తెలుగు లక్ష్మి అందుకున్నారు.









