Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంహైదరాబాద్

TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వ అనుమతి..!

TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వ అనుమతి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 3038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని ఆయన చెప్పారు. కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని, సంస్థలోని ఉద్యోగులు సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంటుందని చెప్పారు.

MOST READ : 

  1. BOI : బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!

  2. TG News : మా అమ్మకు నచ్చనిది.. నానమ్మ, తాతయ్య.. ఓ విద్యార్థి సమాధానం..!

  3. TG News : మా అమ్మకు నచ్చనిది.. నానమ్మ, తాతయ్య.. ఓ విద్యార్థి సమాధానం..!

  4. BOI: ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకున్న బీఓఐ..!

  5. 50years : 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

మరిన్ని వార్తలు