క్రైంBreaking Newsరంగారెడ్డిహైదరాబాద్

అఘోరి ఆడా.. మగా.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!

అఘోరి ఆడా.. మగా.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!

మన సాక్షి:

తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన అఘోరినిమోకిలా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మహిళ సినీ నిర్మాతను మోసగించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అఘోరి భార్య శ్రీ వర్షినితో హరిద్వార్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్లో మోకిలా పోలీసులు అరెస్టు చేసి బుధవారం తీసుకువచ్చారు.

కాగా రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఏసిపి రమణ గౌడ్ విచారణ జరిపిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ఎదుట అఘోరిని హాజరు పరచగా 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు.

దీంతో పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా కంది సబ్ జైలు అధికారులు ఆగోరిని ఏ బారక్ లో ఉంచాలో నిర్ధారించుకోక తిరిగి చేవెళ్లకు తరలించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అగోరికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు.

వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్ జెండర్ అని తేలడంతో తిరిగి పోలీసులు కోర్టు సూచన మేరకు హైదరాబాదులోని చంచల్గూడా జైలుకు తరలించినట్లు సమాచారం. కాగా అఘోరి భార్య తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు హైదరాబాద్లోని  కస్తూరిబా హోం కు తరలించారు.

MOST READ :

  1. Rajiv Yuva Vikas : రాజీవ్ యువ వికాసం.. ముందుగా వారికి 4 లక్షలు, ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు..!

  2. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్.. ఎస్వి మోడల్ స్కూల్ విద్యార్థి..!

  3. UBS: యూబీఎస్‌తో 360 వన్ డబ్ల్యూఏఎం వ్యూహాత్మక భాగస్వామ్యం..!

  4. Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!

  5. ATM : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు