Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

ATM : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

ATM : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

సాధారణంగా బ్యాంకు ఖాతా ఉన్న వారంతా డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఏటీఎంలను వినియోగిస్తుంటారు. కానీ ATM వినియోగించే వారంతా వారందరికీ తెలియని విషయం ఉంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వల్ల ఛార్జీలు పడతున్నాయని అందరికీ తెలియదు.

అయితే ఇటీవల డబ్బులు విత్ డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చెసుకోవడం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకోవడం మరింత ఖరీదు కానున్నది. ఏటీఎంలో ద్వారా డబ్బులు విత్ డ్రా చేయడానికి గతంలో 17 రూపాయల ఛార్జీ విధించేవారు అది కాస్త 19 పెరుగుతుంది.

మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు, నాన్ మెట్రో నగరాలలో మూడు ఉచిత లావాదేవీల పరిమితి ఉంది. ఈ పరిమితి దాటిన తర్వాత అదనపు చార్జీలు కూడా వసూలు చేయబడతాయి. ఇదిలా ఉండగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా అదనపు చార్జీలు వసూలు చేయబడుతున్నాయి.

ప్రస్తుతం 7 రూపాయలు ఉండగా మే ఒకటో తేదీ నుంచి 9 రూపాయలకు పెరుగుతుంది. ఏటీఎం నెట్ వర్క్, ఆపరేటర్లు వైట్ లేబుల్ ఏటీఎం కంపెనీలు ఇంటర్ చేంజ్ ఫీజులు పెంచాలని కోరడంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభ్యర్థనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సమర్పించింది.

దాంతో ఏటీఎం చార్జీలు పెంచేందుకు ఆర్బిఐ అంగీకరించింది. అయితే వినియోగదారులు ఈ అదనపు చార్జీలు నివారించడానికి తరచుగా ఏటీఎంలను ఉపయోగించేవారు తమ సొంత బ్యాంక్ ఎటిఎం లో ఉపయోగించాలి. లేదా డిజిటల్ చెల్లింపులకు ఉపయోగించుకోవాలి.

MOST READ NEWS :

  1. Sugar Patients: షుగర్ పేషంట్లు ఈ రసం తాగితే..!

  2. Loans : కొత్త రకం రుణాలను ప్రవేశపెట్టిన పూనావాలా ఫిన్‌కార్ప్..!

  3. Crypto Currency : క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి.. డబ్బుకు, క్రిప్టోకు తేడా ఏంటి..!

  4. Coolers : కూలర్ కు రూ.15000 చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ. 500లకే..!

  5. JEE : జేఈఈ మెయిన్స్ లో గిరిజన విద్యార్థికి జాతీయ ర్యాంక్..!

మరిన్ని వార్తలు