Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Coolers : కూలర్ కు రూ.15000 చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ. 500లకే..!

Coolers : కూలర్ కు రూ.15000 చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ. 500లకే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

రోజు రోజుకు ఎండలు తీవ్రమయ్యాయి. ఏప్రిల్ మాసంలోనే ఎండలు మండుతుండగా మే నెలలో మరింత వడగాడుపులు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైదరాబాద్ నగరంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది.

దాంతో హైదరాబాద్ వాసులు వేసవి ఎండలు, ఉబ్బకు తట్టుకోలేకపోతున్నారు. కూలర్ల వైపు పరుగులు తీస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి వారు కొత్త కూలర్ కొనాలంటే 15,000 రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు బ్రాండెడ్ కంపెనీలవి కొనాల్సి వస్తుంది. సాధారణ కంపెనీల వైతే 5000 రూపాయలకు పైగానే ఉన్నాయి.

అలాంటి పరిస్థితులలో కూలర్ కొనలేని వారు అద్దె కూలర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు కేవలం 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అద్దె చెల్లిస్తే కూలర్ లు లభిస్తున్నాయి ముందుగా 2000 రూపాయలను అడ్వాన్స్ గా ఉంచుకుంటున్నారు. నెలకు అద్దె చెల్లిస్తే సరిపోతుంది.

15 వేల రూపాయలు ఖర్చుపెట్టి కూలర్ కొనే బదులు మూడు నెలల పాటు 1500 రూపాయలు చెల్లిస్తే వేసవి నడుస్తుందని సామాన్య మధితరగతి వారు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితులలో అద్దె కూలర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇవి “రెంటల్ అప్లైయన్స్” పేరుతో ఆన్లైన్లో కూడా లభిస్తున్నాయి.

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. మంత్రి తుమ్మల స్పష్టం.. బిగ్ అప్డేట్..!

  2. Gold Price : పసిడి పరుగు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..!

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!

  4. TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

  5. JEE : జేఈఈ మెయిన్స్ లో గిరిజన విద్యార్థికి జాతీయ ర్యాంక్..!

మరిన్ని వార్తలు