తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : జర్నలిస్టుల సమస్యలపై అవసరమైతే జoగ్ సైరన్..!

Nalgonda : జర్నలిస్టుల సమస్యలపై అవసరమైతే జoగ్ సైరన్..!

  • అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే

  • అక్రెడిటేషన్ నియమ నిబంధన లు మారిస్తే చూస్తూ ఊరుకోం

  • మీడియా అకాడమీ చైర్మన్ సొం త జిల్లా నుంచే పోరాటo ప్రారంభి స్తాం

  • నల్లగొండ జిల్లా టియూడబ్ల్యూజె సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆస్కాని మారుతీ సాగర్

నల్లగొండ, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా జర్న లిస్టులు అనేకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని తెలంగా ణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్ (H-143) రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి ఆస్కాన్ని మారుతి సాగర్ ఆం దోళన వ్యక్తం చేశారు. జర్న లిస్టు లు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వర లో జంగ్ సైరన్ ప్రకటిస్తామని వెల్ల డించారు.

నల్లగొండ జిల్లా టి యు డబ్ల్యూజే అధ్యక్షుడు గుండగోని జ యశంకర్ అధ్యక్షతన బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన టియుడబ్ల్యూజే జిల్లా కార్య నిర్వాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర కోశాధికారి యోగానంద్, తేంజు అధ్యక్ష, కార్య దర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, రమణ కుమార్, జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్ లతో కలిసి ప్రసంగించారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య నల్లగొండ జిల్లా కేంద్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లోనే కొనసాగు తోందని, మీడియా అకాడమీ చైర్మ న్ సొంత జిల్లాలోనే ఇటువంటి పరి స్థితి నెలకొనడం బాధాకరమన్నారు. జర్నలిస్టులో ఇళ్ల స్థలాలతో పాటు ఇతరేతర ప్రధాన సమస్యలన్నింటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఎక్కడికక్కడ నిలదీత కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి విషయం తో పాటు విధివిధానాల రూపకల్ప నలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. గడిచిన పది సంవత్సరాలలో మాజీ చైర్మన్ అల్లం నారాయణ నాయకత్వంలో కింది నుంచి పై స్థాయి వరకు విభాగాల వారీగా ప్రతి ఒక్క జర్నలిస్టు న్యాయం జరిగే విధంగా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తే అదేదో రాష్ట్రాన్ని దివాలా తీయించే కార్యక్రమం మాదిరిగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం ప్రస్తుత అకాడమీలో ఉన్న వ్యక్తులకు సరైందికాదని సూచించారు.

ఇప్పటికైనా వ్యక్తిగత రాగాద్వేషాలను వీడి జ ర్నలిస్టు సంక్షేమమే కేంద్రంగా ప్రస్తు త అకాడమీ పెద్దలు పనిచేయాలని హితువు పలికారు. ఏది ఏమైనప్ప టికీ ఏ ఒక్క జర్నలిస్టుకు అక్రిడిటే షన్ విషయంలో ఎలాంటి జాప్యం కానీ అన్యాయం కానీ జరిగితే టి యుడబ్ల్యూజే చూస్తూ ఊరుకోద ని, సమరశీల పోరాటాలకు సన్నద్ధ మవుతామని హెచ్చరించారు.

మే 31 టిజెఎఫ్ రజతోత్సవo కు తరలిరావాలి

తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 వ సంవత్సరంలోకి అడుగుపెడుతు న్న సందర్భాన్ని పురస్కరించుకొని మే 31వ తేదీన టిజెఎఫ్ రజతోత్స వ సభ హైదరాబాద్ కేంద్రంగా నిర్వ హించ తలపెట్టినట్లు మారుతి సాగ ర్ తెలిపారు.

నల్లగొండ జిల్లా జర్నలిస్టులు ప్రతి మండలం నుంచి ఒక వాహనం చొప్పున పెద్ద ఎత్తున తర లిరావడం ద్వారా టీజేఎఫ్ రజతో త్సవ సభలను జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తం గా టీయూడబ్ల్యూజే సభ్యత పరంగా గాని, కమిటీల నిర్మాణం పరంగా గాని పటిష్టవంతంగా ఉన్నందు న రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అధికంగా నల్లగొండ జిల్లా నుంచి భారీ సంఖ్యలో జర్నలిస్టు తరలివచ్చి సభను దిగ్విజయం చేయాలని కోరారు.

MOST READ :

  1. Chicken: చికెన్ లేనిదే ముద్ద దిగట్లేదా.. అయితే ఇది తెలుసుకోవల్సిందే..!

  2. Breakfast: మంచి ఆహారమని బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తింటున్నారా.. అయితే చాలా ప్రమాదం..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు.. జడ్పీ సీఈఓ కు ఫిర్యాదు..!

  4. Palms : ఎండాకాలంలో తాటి ముంజలు తింటే.. శరీరంలో అద్భుతమైన మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!

  5. TG News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

మరిన్ని వార్తలు