తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు..!

Miryalaguda : రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని త్రిపురారం మండలం కంపాసాగర్ లోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మిర్యాలగూడ మండలం జప్తివిరప్పగూడెం గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మంచి దిగుబడులు సాధించాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. రైతులకు సాగునీటి సమర్థ వినియోగం, తక్కువ యూరియా వాడకంపై అవగాహన కల్పించారు.

వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ లింగయ్య, కె వి కే శాస్త్రవేత్త చంద్రశేఖర్ రాములమ్మ ముఖ్యమైన విత్తనాలను, లభ్యతను, పంట కోతలలో విత్తనాలు కొనుగోలులో రసీదులను భద్రపరుచుట, సమగ్ర పురుగు, తెగుళ్ళ మందుల సద్వినియోగం, చెట్లు నాటుట పై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పథకాలను రైతులకు తెలియజేశారు. నల్గొండ జిల్లా ఉద్యాన అధికారి అనంతరెడ్డి విద్యాశాఖ అధికారి నర్సింహ కూరగాయలు, పళ్ళతోటలు, పామాయిల్ సాగులో ప్రభుత్వం అందిస్తున్న సహకారాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత రెడ్డి, మత్స్యశాఖ అధికారి కిషోర్ , ఆత్మ ఏటీఎం కృష్ణ నాయక్, ఆత్మ చైర్మన్ శ్రీనివాసరావు, అభ్యుదయ రైతులు చలపతిరావు, జిందా, వ్యవసావిస్తరణ అధికారి రమేష్, షఫీ తెలంగాణ రాష్ట్ర విత్తనం విత్తన ఉత్పత్తి సంస్థ అధికారులు రాంబాబు, నసీమా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

MOST READ : 

  1. Nalgonda : నల్గొండలో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అనుమానితులు.. ఎయిర్ గన్స్ గంజాయి చాక్లెట్స్, హుక్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు..!

  2. TG News : భూ భారతి ఫైలెట్ మండలాలే రాష్ట్రానికి దిక్సూచి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..!

  3. Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం..!

  4. Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

  5. TG News : రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ బ్యాడ్జీలను ఎవరు వాడారో తెలుసా.. తెలంగాణలో లభ్యం..!

మరిన్ని వార్తలు