Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. రైతు భరోసా నిధుల్లో పెండింగ్లో ఉన్న రైతులకు వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రైతులకు ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున రెండు విడుతలుగా అందజేయనున్నారు. కాగా మార్చి 31వ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.
ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేశారు. మిగతా రైతులు రైతు భరోసా పథకం కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా పథకానికి ఎలాంటి కటాఫ్ కూడా విధించలేదు. అయినా కూడా అందరి రైతులకు రైతు భరోసా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఏది ఏమైనా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో అధికారులు కసరత్తు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ తర్వాత రైతుల ఖాతాలలో నిధులు జమ కానున్నాయని సమాచారం.
ఈనెల 23వ తేదీ నుంచి జూన్ నెలాఖరు వరకు రైతులందరికీ రైతు భరోసా ద్వారా వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు. జూలై మాసం నుంచి వానాకాలం రైతు భరోసా కు అధికారులు కసరత్తు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇది కూడా చదవండి
-
Miryalaguda : రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు..!
-
Hair Fall : పురుషులకే బట్టతల ఎందుకు.. నివారణకు సూచనలు..!
-
Muthoot : రికార్డు స్థాయిలో రుణాలు, లాభాలు.. ముత్తూట్ ఫైనాన్స్ ఆర్థిక ఫలితాలు విడుదల..!
-
Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం..!









