TOP STORIESBreaking Newsజాతీయం

Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!

Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

నిరుద్యోగులకు సువర్ణ అవకాశం లభించింది. బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి భారీ శుభవార్త అందింది. ఈ నెల (మే) 8వ తేదీన ఐడిబిఐ బ్యాంకు జూనియర్ అసిస్టెంట్, మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దేశవ్యాప్తంగా 676 జూనియర్ అసిస్టెంట్, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఐడిబిఐ దరఖాస్తులు స్వీకరిస్తుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవొచ్చును. చివరి తేదీ మే 20 గా నోటిఫికేషన్ లో వెల్లడించింది. అయితే ఈ ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చును. అభ్యర్థుల వయసు 01 మే 2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల వారీగా సడలింపు ఉంటుంది. ఆబ్జెక్టివ్ రూపంలో పరీక్ష ఆ తర్వాత ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ల ద్వారా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి ఏడాదికి 6.14 లక్షల నుండి 6. 50 లక్షల వరకు జీతం ఉంటుంది. వాటితో పాటు DA, HRA ఉంటాయి. ఈ రాత పరీక్షను జూన్ 8వ తేదీన నిర్వహించనున్నారు. అయితే దరఖాస్తులకు మాత్రం రేపటితో (మే 20) గడువు ముగియనున్నది. దరఖాస్తులు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.idbibank.in/idbi-bank-careers-current-opening-aspx సందర్శించాలి.

MOST READ :

మరిన్ని వార్తలు