UPSC : పట్టు వదలని విక్రమార్కుడు.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి టాప్ ర్యాంకర్..!
UPSC : పట్టు వదలని విక్రమార్కుడు.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి టాప్ ర్యాంకర్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
యుపిఎస్సి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ – 2024 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 143 మందితో ఎంపికైన వారి జాబితాను యాపిఎస్సి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు టాప్ ర్యాంకర్లుగా నిలిచి సత్తా చాటారు.
ఈ ఫలితాల్లో తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసి చాడ నిఖిల్ రెడ్డి 11వ ర్యాంకు సాధించారు. పట్టు వదలని విక్రమార్కుడిలా చాడ నిఖిల్ రెడ్డి ఐఎఫ్ఎస్ పరీక్ష ఐదుసార్లు రాశారు. చివరికి టాప్ ర్యాంకర్ గా నిలిచాడు.
తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులే
మిర్యాలగూడ కు చెందిన చాడ నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులు చాడ శ్రీనివాస్ రెడ్డి, సునంద ఇద్దరు ఉపాధ్యాయులే. నిఖిల్ రెడ్డి పదవ తరగతి కేకేఆర్ గౌతమ్ స్కూల్లో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ చైతన్య గూడవల్లి కళాశాలలో పూర్తి చేయగా ఐఐటి 91వ ర్యాంక్ సాధించి ఢిల్లీలోని ఐఐటి కళాశాలలో చదివాడు. యుపిఎస్సి లో ఐఎఫ్ఎస్ 5వ సారి పరీక్ష రాయగా ప్రస్తుతం టాప్ ర్యాంకర్ గా నిలిచాడు.
150 పోస్టులకు నోటిఫికేషన్
150 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడగా గత ఏడాది జూన్ 16వ తేదీన యుపిఎస్సి ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. అనంతరం నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మెయిన్స్ పరీక్ష, 2025 ఏప్రిల్ 21 నుంచి మే 2వ తేదీ వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించిన అధికారులు తాజాగా తుది ఫలితాలు విడుదల చేశారు.
సత్తా చాటిన తెలుగువారు
నిఖిల్ రెడ్డి తో పాటు తెలుగువారు యెడుగూరి ఐశ్వర్య రెడ్డి 13వ ర్యాంకు, చేరూరి అవినాష్ రెడ్డి 40 ర్యాంకు, చింతకాయల లవ కుమార్ 49వ ర్యాంకు, అట్ల తరుణ్ తేజ 53వ ర్యాంకు, ఆలపాటి గోపీనాథ్ 55వ ర్యాంకు సాధించారు.
MOST READ :
-
Gold Price : మరోసారి పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
-
Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!
-
Fire Accident : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..!
-
Murder Case : సంచలనం కలిగించిన మహిళ హత్య.. కేసు చేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు..!
-
ATM : ఏటీఎం నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం..!









