Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

Murder Case : సంచలనం కలిగించిన మహిళ హత్య.. కేసు చేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు..!

Murder Case : సంచలనం కలిగించిన మహిళ హత్య.. కేసు చేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని చెంబకూరు సమీపంలో ని ఎలకపల్లె గ్రామ సమీపంలో అత్యంత కీరాతంగా మహిళ కాళ్ళు చేతులు కట్టేసి, మెడకు త్రాడు బిగించి హత్యచేసి, అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె హత్యకు కారణమైన ముగ్గురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీస్ లకు ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా చేశారు. అయితే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో, డాగ్ స్క్వాడ్ ద్వారా, నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని, మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ, వి.విద్యాసాగర్ నాయుడు వివరాలు వెల్లడించారు.

అన్నమయ్య జిల్లా రాయచోటి లో మే 19న అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ డివిజన్ మదనపల్లి రూరల్ సర్కిల్ రామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని 11/5/2025 వ తేదీన, చెంబుకూరు ఎలకపల్లి రహదారిలో ఓ మహిళ కాలిన గాయాలతో చనిపోయి ఉందని వీఆర్వో అనూష ఫిర్యాదు మేరకు, రామసముద్రం పోలీస్ స్టేషన్ లో 12/5/2025 వ తేదీన సీఆ ర్ .నెంబర్ . బి ఎన్ ఎస్ యాక్ట్ ప్రకారం, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతట కాలిన శరీరం యొక్క కుడి చేతి మీద వున్న పచ్చబొట్టు “యస్మిత” అన్న పేరును గుర్తించి దాని ద్వారా దర్యాప్తు చేయగా పోలీసువారి విచారణలో హత్య కాబడ్డ మహిళ బూసిపల్లి శివమ్మ (వయస్సు 27 సం.) భర్త వెంకటరమణ, జంగాలపల్లి వేంపల్లి పంచాయతీ, మదనపల్లి మండలం గా గుర్తించారు.

మదనపల్లి టౌన్, ఈశ్వరమ్మ కాలనీకి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వెల్లిపోయిందన్న కారణముతో ఆమె మీద కక్ష పెంచుకొని, ముద్దాయిలు ఆమె కాళ్ళు, చేతులను తాళ్లతో బంధించి, త్రాడు గొంతుకు బింగించి చంపేసి, ఎటువంటి ఆధారాలు లేకుండా చేయుటకు, చనిపోయిన మహిళపైన పెట్రోల్ పోసి నిప్పంటించి అతి భయంకరంగా, అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసును మదనపల్లి రూరల్ సర్కిల్ పోలీసులు చేధించారు.

మదనపల్లి డిఎస్పీ యస్, మహేంద్ర, మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ ఏ, సత్యనారాయణ, రామసముద్రం యస్ఐ. జి.రవికుమార్ పోలీస్ సిబ్బంది చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను రామసముద్రం తాసిల్దార్ కార్యాలయం దగ్గర అరెస్టు చేశారు. వారు నిన్నటి దినం ఆదివారం 18.05.2025 సా.5.00 గం.లకు రామసముద్రం విఆర్ఓ సమక్షంలో నేరం ఒప్పుకొని అరెస్టుచేశారు.

అరెస్టు చేసిన ముద్దాయిల వివరాలు. (1) యం. నీలావతి, దొమ్మసంద్ర, బెంగళూరు కర్ణాటక రాష్ట్రం, స్వస్థలం జంగాలపల్లి వేంపల్లి పంచాయతీ మదనపల్లి మండలం (2) కన్నె మడుగు గణేష్, గుండే వారిపల్లి, నడింపల్లి పంచాయతీ, రామసముద్రం మండలం (3) హెచ్.వి.గోపాల్ , అంబేద్కర్ కాలనీ బి.హోసహళ్ళి, సజ్జాపురం, బెంగుళూరు కర్ణాటక రాష్ట్రం.

పై ముగ్గురిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన రెండు లీటర్ల పెట్రోల్ బాటిల్స్ రెండింటిని, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనపరచుకోవడం జరిగింది, ముద్దాయిలను స్వాధీన పరుచుకున్న వస్తువులను పుంగనూరు న్యాయస్థానం వారి ముందు హాజరు పరుస్తామన్నారు .ఎటువంటి ఆధారాలు, ఆనవాళ్లు లేకుండా వివాహిత మహిళను హత్య చేసిన దుండగులను అతి చాకచక్యంగా, టెక్నికల్ టీం, డాగ్ స్క్వాడ్ వారి సహకారంతో కేసును చేధించడం జరిగింది.

అతి తక్కువ సమయంలో ఈ కేసు ఛేదించిన మదనపల్లి డిఎస్పి, మదనపల్లి రూరల్ సీఐ, రామసముద్రం ఎస్సై జి రవికుమార్, ఏ ఎస్సై హిమాచలపతి, హెడ్ కానిస్టేబుల్ లోకేష్, బాలాజీ, కిరణ్, పురుషోత్తం, సురేంద్రయాదవ్, జ్యోతి జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అభినందించారు. మహిళను అతీకిరాతంగా హత్య చేసిన నిందుతులను త్వరగా పట్టుకున్న డి ఎస్పీ మహేంద్ర, సీఐ సత్యనారాయణ,ఎస్సై రవికుమార్ పోలీస్ సిబ్బందిని మండల రాజకీయ నాయకులు ప్రజలు అభినందనలు తెలిపారు.

MOST READ : 

  1. Nalgonda : ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస చోరీలు.. రోగుల బెంబేలు.. రంగంలో దిగిన పోలీసులు..!

  2. Fire Accident : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..!

  3. TG News : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

  4. Accident : తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. ఢీకొన్న బస్సు, జీపు..!

మరిన్ని వార్తలు