తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యహైదరాబాద్

Civils Rank : స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా సివిల్స్ లో ర్యాంక్ సాధించిన శివాని.. RTC ఎండీ స‌జ్జ‌న‌ర్ సన్మానం..!

Civils Rank : స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా సివిల్స్ లో ర్యాంక్ సాధించిన శివాని.. RTC ఎండీ స‌జ్జ‌న‌ర్ సన్మానం..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

సివిల్స్‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచి 11వ‌ ర్యాంకు సాధించిన వ‌రంగ‌ల్‌కు చెందిన ఇట్ట‌బోయిన సాయి శివానిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ అభినందించారు. త‌న త‌ల్లిదండ్రులు రాజు, ర‌జిత‌తో క‌లిసి సాయి శివానిని ఆయ‌న స‌త్క‌రించారు.

సివిల్స్ ర్యాంక‌ర్ సాయి శివాని మేన‌మామ‌ ప్ర‌కాశ్ రావు ఆర్టీసీలో డీఎం హోదాలో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే హైద‌రాబాద్‌లోని బ‌స్ భ‌వ‌న్‌లో గురువారం ఆమె త‌న కుటుంబ స‌భ్యుల‌తో మర్యాద‌పూర్వ‌కంగా సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్‌ను క‌లిశారు.

సాధార‌ణ కుటుంబానికి చెందిన సాయి శివాని.సివిల్స్‌లో చిన్న వయ‌సులోనే అత్యుత్త‌మ ర్యాంకు సాధించి యువ‌త‌కు స్పూర్తిగా నిలిచార‌ని ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌న‌ర్ కొనియాడారు. ఈ డిజిట‌ల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా, సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా అనుకున్న ల‌క్ష్యాన్ని ఆమె సాధించార‌ని ప్ర‌శంసించారు.

విధి నిర్వ‌హ‌ణ‌లో అంకిత‌భావంతో ప‌నిచేసి ఉన్నతంగా రాణించాల‌ని ఆమెకు సూచించారు ఈ కార్య‌క్ర‌మంలో టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ మునిశేఖ‌ర్, సిరిసిల్ల డీఎం ప్ర‌కాశ్ రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

  2. Suryapet : మా పిల్లల్ని మాకు ఇప్పించండి.. లేకుంటే ఆత్మహత్యలు శరణ్యం.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  4. TG News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు