Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

2025వ సంవత్సరంలో ఏం జరగబోతుంది.. మునిపెన్నడూ లేనంతగా ప్రపంచంపై ఏ ప్రభావం చూపబోతుంది.. ఆమె ఏం చెప్పింది. అనే విషయం పరిశీలిద్దాం. బల్గేరియా కు చెందిన ప్రసిద్ధ అంధ జ్యోతిష్యురాలు బాబా వంగా. 2025 వ సంవత్సరానికి సంబంధించి ఘోర విపత్తుల గురించి ఆమె భవిష్యవాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. 2025లో ఏ విపత్తులు జరగబోతున్నాయి. ఆమె ఇప్పటివరకు చెప్పినవన్నీ నిజం కావడంతో ఇప్పుడు దీని గురించి తీవ్ర చర్చ జరుగుతుంది.

ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ప్రపంచ యుద్ధాల వంటి వాటి గురించి ఈమె జోష్యం చెప్పింది. కరోనా అనే వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తుందని కూడా ఆమె ముందే చెప్పారు. ఆమె చెప్పినట్లుగానే కరోనా వచ్చిన ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దాంతో ఆమె చెప్పే జ్యోతిష్యాన్ని చాలా వరకు జనాలు నమ్ముతారు.

2025లో ఏం జరగబోతుందని చెప్పారు..?

2025లో పెను విపత్తు సంభవించబోతున్నట్లు ఆమె ఇటీవల జ్యోతిష్యం చెప్పింది. ఆ విపత్తు ప్రపంచాన్ని కుదిపేసే స్థాయిలో ఉంటుందని చెప్పింది. ఆమె చెప్పిన జ్యోతిష్యాలను నమ్మి అభిమానులు ఆమె అనుచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పెను విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పినప్పటికీ అది ఏ రూపంలో వస్తుందో..? అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అది ప్రపంచ యుద్ధమా..? ప్రకృతి విలయమా..? లేక ఆర్థికపరంగా జరిగే విపత్తునా..? అనేది స్పష్టత లేదు. అయినా కూడా జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే కొందరు బాబా వంగా భవిష్యవాణి తరచూ అస్పష్టంగా ఉంటాయని, వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని విమర్శకులు అంటున్నారు. ఆమె జోష్యం కు శాస్త్రీయ ఆధారాలు లేవని కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా సరిపోలినవిగా భావిస్తారు.

అయితే ఈ జోస్యం చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కచ్చితం గురించి సందేహాలు ఉన్నాయి. అయితే ఆమె భవిష్యవాణి నిజమవుతుందో లేదో తెలియాలంటే 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు వెయిట్ చూడాల్సి ఉంది.

MOST READ : 

  1. TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  2. District SP : తెలంగాణలో సంచలనం.. పిల్లల అక్రమ రవాణా 13 మంది ముఠా అరెస్టు..!

  3. Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు లేనట్టేనా..!

  5. Nalgonda : అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయల వసూలు.. నిండా ముంచిన యూనిక్ కంపెనీ.. బాధితుల ఆందోళన..!

మరిన్ని వార్తలు