Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsవ్యవసాయం

TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాలలో 41,361 మంది రైతులకు సంబంధించిన 5,528 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. కాగా ఇచ్చిన హామీ మేరకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన 51.528 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారంగా బుధవారం మంజూరు చేసింది.

ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వివిధ విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతులకు వారి ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నది. రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి నాగేశ్వరరావు ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు ,ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, పత్తి 4753 ఎకరాలు, ఇతర పంటలు 477 ఎకరాలు అధికారుల అంచనాలో పంట నష్టపోయిన వివరాలు ఈ విధంగా తేలాయి.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి

  1. Flash.. Flash : వేములపల్లిలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ యువకుడు మృతి..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!

  3. Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు లేనట్టేనా..!

  4. TG News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు