తెలంగాణBreaking Newsహైదరాబాద్

Hyderabad : ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన డాక్టర్ వంశీ రెడ్డి..!

Hyderabad : ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన డాక్టర్ వంశీ రెడ్డి..!

కూకట్ పల్లి, (మన సాక్షి) :

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన తెలంగాణ డాక్టర్లు
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం కూకట్పల్లికి చెందిన పదిమంది డాక్టర్లతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రెడ్డి తన డాక్టర్ల బృందంతో కలిసి నేపాల్ దేశం నుండి ట్రేక్కింగ్ చేస్తూ ఎవరెస్టు బేస్ క్యాంప్ చేరుకున్నారు.

ఈ సందర్బంగా వంశి రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ ఎవరెస్టు డేను పురస్కరించుకొని నేల మట్టం నుండి ఎవరెస్టు బేస్ క్యాంప్ 5364 మీటర్లు ఎక్కగా అక్కడి నుండి కాలపత్తర్ 5555 మీటర్ల ఎత్తు ఎక్కామని తెలిపారు. ఎవరెస్టు డే సందర్బంగా చేరుకున్నందుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎవరెస్టు శిఖరము ఎక్కే బేస్ క్యాంప్ వద్ద జాతీయ జెండాను ఎగరవేసేందుకు అక్కడకు చేరుకున్నట్లు ఫోన్ లైన్లో తెలిపారు.

ఈ కార్యక్రమంలొ డాక్టర్ కేదర్ వంశీధర్, డాక్టర్ ప్రదీప్ రెడ్డీ, డాక్టర్ కమలాకర్, డాక్టర్ పవన్, డాక్టర్ రమేష్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ శివ, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  4. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

మరిన్ని వార్తలు