Sri Renuka Ellamma : శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు షురూ..!
Sri Renuka Ellamma : శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు షురూ..!
రేపు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ – జమదగ్ని మహామునిల కళ్యాణం
అమ్మవారి కళ్యాణానికి హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కనగల్, మన సాక్షి:
భక్తుల కొంగుబంగారంగా విరాజుల్లుతున్న నల్లగొండ జిల్లా, కనగల్ మండలంలోని దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు వివిధ పూజా కార్యక్రమాలతో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ డప్పుచప్పుళ్ళు, మంగళ వాయిద్యాలతో ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.
తెల్లవారుజాము నుంచి సుప్రభాత సేవ, లలితా సహస్రనామార్చన, బాలభోగ నివేదన, ధ్వజారోహణ, దేవి మూల మంత్ర హోమములు, మండల పూజలు, నీరాజన మంత్రపుష్పములు, మహా నివేదన, గవ్యాంత పూజలు, నిత్య హోమములు, వాస్తు పూజ, విగ్నేశ్వర పూజ, రక్షాబంధనము, అఖండ దీపారాధన, బలిహరణ, చండీ హోమం, ఎదురుకోళ్ళు మహోత్సవం వైభవంగా వేద పండితులు నిర్వహించారు.
నేడు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం:
అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు శుక్రవారం శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ – జమదగ్ని మహామునిల లోక కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించనున్నారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం కల్యాణ మండపం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలాంకరణతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. మంచి నీరు తదితర మౌలిక వసతులను ఆలయ పాలకమండలి, ఆలయ సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లను చేస్తున్నారు.
రాష్ట్ర రోడ్లు – భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్యాణానికి హాజరు కానున నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు. అమ్మవారి కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జల్లేపల్లి జయరామయ్య, ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు సిహెచ్. నగేష్ గౌడ్, జె. నవీన్ గౌడ్, కె. శంకర్ రెడ్డి, ఎం. రాజు, కే. రమేష్, ఆర్. వెంకన్న, ఎన్. బాబు, సైదులు, సిహెచ్. దుర్గమ్మ, ఎం. రమేష్, కే. ప్రభాకర్, ఆలయ ముఖ్య అర్చకులు ఎన్. మల్లాచారి,
సిహెచ్. శ్రవణ్ కుమార్ చార్యులు, అర్చకులు జి. ఉమామహేశ్వర రావు, దామోదర్ రావు, శ్రీనివాస్ చారి, ఫణి కుమార్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ జె. చంద్రయ్య, జి. నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ ఎన్. ఆంజనేయులు, కె. ఉపేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది టి. రాజయ్య, జె. రాజు, సిహెచ్. శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Cm Revanth Reddy : 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సభ స్థలిని పరిశీలించిన రాచకొండ సిపి..!
-
Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
WhatsApp : వాట్సాప్ లోకి అనుకున్న సరికొత్త ఫీచర్..!









