FY2025 : సంప్రదాయ పాలసీలపై రూ. 900 కోట్ల పైగా రుణాలిచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్..!

FY2025 : సంప్రదాయ పాలసీలపై రూ. 900 కోట్ల పైగా రుణాలిచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్..!
• 42,700 మందికి పైగా ఖాతాదారులు తమ సంప్రదాయ పాలసీలపై లోన్లు పొందారు
• పాలసీపై లోన్ అనేది అనూహ్య ఆర్థిక అవసరాలను తీర్చడానికి సులభంగా డబ్బు అందించే మార్గం
• 98% కంటే ఎక్కువ లోన్లు 24 గంటల లోపలే మంజూరయ్యాయి
• దీనితో ఆర్థిక అత్యవసరాలను తీర్చుకుంటూనే ఖాతాదారులు తమ దీర్ఘకాలిక పొదుపు మరియు జీవిత బీమా ప్రయోజనాలను కొనసాగించగలరు
• BFSI రంగంలో అతి తక్కువ వడ్డీ రేటుతో ఈ లోన్ లభిస్తుంది
• 100% డిజిటల్ ప్రక్రియ, ఎటువంటి పేపర్ వర్క్ అవసరం లేదు
• 52% ఖాతాదారులు కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా లోన్ పొందారు
ముంబై, మన సాక్షి:
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, 2025 ఆర్థిక సంవత్సరంలో తమ ఖాతాదారులకు సంప్రదాయ పాలసీలపై రూ. 900 కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. తద్వారా అనూహ్యమైన ఆర్థిక అత్యవసరాలకు కావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు కస్టమర్లకు తోడ్పడింది.
దీర్ఘకాలిక ప్రణాళికలైన జీవిత బీమా మరియు పొదుపు లక్ష్యాలు దెబ్బతినకుండా నిధులను సమకూర్చుకోవడంలో కస్టమర్లకు తోడ్పడుతుంది కాబట్టి పాలసీపై రుణం అనేది ఎంతో ఉపయోగకరమైన ఫీచరుగా నిలుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో, 42,700 మందికి పైగా ఖాతాదారులకు కంపెనీ ఈ రుణాలను అందించింది.
“లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక దీర్ఘకాలిక సాధనం. పాలసీ గడువు ముగిసేంత వరకు అంకితభావంతో కొనసాగించడమనేది ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి కీలకంగా ఉంటుంది. అయితే, ఖాతాదారులకు ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావొచ్చనే విషయం మాకు తెలుసు. అందుకే ఈ లోన్ ఫీచర్ను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచిస్తున్నాం. ఇది తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడంలో సహాయపడుతుంది. అదే సమయంలో తమ పొదుపు ప్రణాళికను కూడా యథాప్రకారం కొనసాగించుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఖాతాదారులు తమ పాలసీ ‘సరెండర్ వ్యాల్యూ’లో 80% వరకు రుణం పొందవచ్చు.
మా అన్ని సేవా కేంద్రాలు (టచ్ పాయింట్లు) ఖాతాదారుల పాలసీపై లోన్ అభ్యర్థనలను స్వీకరించి, వేగంగా ప్రాసెస్ చేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా, 98% పైగా రుణాలు 24 గంటలలోపే మంజూరయ్యాయి. ఇవన్నీ పేపర్లెస్ విధానంలోనే జరిగాయి.
పాలసీపై లోన్ తీసుకున్న ఖాతాదారులు ఎక్కువగా డిజిటల్ టచ్ పాయింట్లయిన వెబ్సైట్ మరియు మొబైల్ యాప్లను ఉపయోగించుకున్నారు. 52% మంది ఖాతాదారులు కంపెనీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా లోన్ పొందారు. రుణ చెల్లింపు ప్రక్రియను కూడా సరళతరం చేసి, పూర్తిగా డిజిటల్ చేశాము. తద్వారా ఖాతాదారులు రుణ వ్యవధి ఆసాంతం సులభంగా నిర్వహించుకునేందుకు వీలవుతుంది.
2025 ఆర్థిక సంవత్సరంలో పాలసీపై లోన్ తీసుకునే ఖాతాదారుల సంఖ్య 60% వృద్ధి చెందింది. చాలా మందిలో దీర్ఘకాలిక పెట్టుబడిగా పాలసీని కొనసాగించాలనే నిబద్ధత ఉందనేందుకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
పాలసీపై తీసుకునే లోన్ అనేది ఖాతాదారుల క్రెడిట్ స్కోర్‌పై ఎటువంటి ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఈ లోన్ ద్వారా పాలసీ ప్రీమియంలు కూడా చెల్లించే వెసులుబాటు ఉండటం మరో విశేషం. తద్వారా పాలసీ మరియు దాని ప్రయోజనాలు నిరంతరం కొనసాగుతాయి” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ Mr. అమిష్ బ్యాంకర్ తెలిపారు.









