TOP STORIESBreaking Newsతెలంగాణవిద్య

TG News : రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.8 వేలు..!

TG News : రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.8 వేలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు కీలక చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించింది. నర్సరీ, LKG, UKG తరగతులను నిర్వహించనున్నారు. ఈ తరగతుల నిర్వహణ కోసం ప్రతి పాఠశాలలో ఒక విద్యా వాలంటీర్, ఒక ఆయాను నియమించనున్నారు.

అందుకు గాను వాలంటీర్ కు నెలకు 8000 రూపాయలను, ఆయాకు 6000 రూపాయలను గౌరవ వేతనంగా ఇవ్వాలని నిర్ణయించింది. స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పించనున్నారు. కొత్తగా ఏర్పాటు అయ్యే ఆ తరగతులలో చిన్నారులకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాల కోసం ఒక్కో పాఠశాలకు 1.5 లక్షల రూపాయలను ఖర్చు చేయనున్నారు.

210 ప్రీ ప్రైమరీ పాఠశాలలకు కేంద్ర విద్యా శాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి అనుమతి కూడా తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి 1486 కోట్ల రూపాయలను నిధులను వినియోగించనున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 20 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్న గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యా బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.

MOST READ NEWS : 

  1. Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!

  2. Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ..  రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!

  4. Nalgonda : ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి.. చావు బతుకుల మధ్య తల్లి..!

  5. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు