తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికల అప్డేట్.. సీఎం రేవంత్ రెడ్డి వారికి వార్నింగ్..!

CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికల అప్డేట్.. సీఎం రేవంత్ రెడ్డి వారికి వార్నింగ్..!

మన సాక్షి, హైదరాబాద్ :

రాష్ట్రంలో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ఇన్చార్జి మంత్రుల పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం పిసిసి సమావేశం గాంధీభవన్ లో నిర్వహించారు.

పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పనిచేయని వారికి డిమోషన్లు.. పనిచేసిన వారికి ప్రమోషన్లు పార్టీలో ఉంటాయని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేసే బాధ్యత ఇన్చార్జి మంత్రులకు అప్పగించినా ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

అదేవిధంగా మంత్రి పదవుల కోసం కొంతమంది కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయించడం పై ఆయన సీరియస్ అయ్యారు. పార్టీ క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరిక జారీ చేశారు. పదవులు వచ్చిన వారు రాష్ట్రవ్యాప్తంగా తిరగాలని ఆదేశించారు. అదేవిధంగా అతి త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం సీట్లు గెలిచేలా ఇన్చార్జి మంత్రుల బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా ఇన్చార్జి మంత్రులకు నిధులు ఇచ్చామని, వాటిని సరిగా ఎందుకు ఆయా జిల్లాల్లో ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. పని చేస్తే ప్రమోషన్ ఇస్తామని.. పనిచేయకపోతే పక్కన పెట్టడంలో మొహమాటం లేకుండా ఉంటుందని తేల్చి చెప్పారు.

రాబోయే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్ లు వచ్చే అవకాశం ఉందని, 2029 ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లాగా పని చేయాలని ఆయన సూచించారు.

18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ గా ఆయన అభివర్ణించారు. బూత్ , గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామని తెలిపారు.

MOST READ ; 

  1. Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!

  2. District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి..!

  3. Nalgonda : ప్రజావాణిలో వినతుల వెల్లువ.. కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నబాధితులు..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

  5. TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు