Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TG News : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అప్పటి లోగా నిర్వహించాలని ఆదేశాలు..!

TG News : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అప్పటి లోగా నిర్వహించాలని ఆదేశాలు..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జస్టిస్ మాధవి బెంచ్ ఎన్నికల నిర్వహణపై ఆదేశించింది.

సోమవారం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం, పిటిషనర్ల, ఎన్నికల సంఘం వాదనలు హైకోర్టు లో కొనసాగాయి. కాగా మూడు నెలల పాటు ఎన్నికల నిర్వహణకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. దాంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది.

ఈ మేరకు బుధవారం తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీ లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కోరిన విధంగానే మూడు నెలల పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గడువు ఇచ్చింది.

2024 ఫిబ్రవరి 1 తో రాష్ట్రంలో సర్పంచ్ ల గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఏడాదిపైగా గడిచినప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహించలేదు. దాంతో ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఆరు పిటిషన్లు వేశారు.

MOST READ : 

  1. Power Cut : నేడు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కోత.. ఉదయం 10 గంటల నుంచే.. ఎప్పటివరకంటే..!

  2. Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!

  3. District collector : రైతు భరోసా సంబరాలకు నల్గొండ జిల్లా రైతులు.. జెండా ఊపిన జిల్లా కలెక్టర్..!

  4. Students : ఇంటర్ చదివే విద్యార్థులు.. లక్షల రూపాయలు వారికి ఎక్కడివి.. కట్ చేస్తే పోలీసుల అదుపులో..!

మరిన్ని వార్తలు