Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!

Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!

పెన్ పహాడ్, మన సాక్షి:

వేలాది రూపాయల డొనేషన్లు కట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్న రోజులు ఇవి. రెక్కాడితే డొక్కాడని వారు సైతం తమ పిల్లలను ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూళ్లలో చదివించాలని ఆశపడుతున్నారు. అప్పు చేసినా ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఓ ఉపాధ్యాయురాలు తమ కొడుకును తన వెంటే ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్తుంది. తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తుంది. అది ఎక్కడో..? ఏంటో తెలుసుకుందాం..

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న కొప్పుల శోభ పరెడ్డి వీరారెడ్డి (ఎస్ జి టి వెలిదండ) తన చిన్న కుమారుడు సిద్దార్థ ఆర్యన్ రెడ్డిని 4 వ తరగతి లో తాను పని చేస్తున్న చీదేళ్ల ప్రాథమిక పాఠశాలలోనే మంగళవారం చేర్పించారు. వారు మన అందరికి ఆదర్శం గా నిలిచారు.

‘మా పిల్లలను మేం పని చేస్తున్న బడిలోనే చేర్పించడం వల్ల గ్రామస్థులకు నమ్మకం పెరిగి వారి పిల్లలను కూడా చేర్పిస్తున్నార’నిశోభ తెలిపారు. శోభ ని పాఠశాల ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయురాలు ఎం సావిత్రి ,ఉపాధ్యాయులు శీలం రాములు, ఆర్తి సరిత తదితరులు అభినందించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు