Nalgonda : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..!

Nalgonda : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..!
నల్లగొండ, మనసాక్షి:
ఇటీవలే నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ల బృందం బుధవారం మరో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. నల్గొండ జిల్లా పర్వేదుల గ్రామానికి చెందిన 60 సంవత్సరాల మహిళ గత రెండు సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి వైద్యం నిమిత్తం వచ్చింది.
ఆస్పత్రిలోని వైద్యులు ఆ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె కడుపులో కణతి ఉన్నట్లు గుర్తించారు. మహిళ కుటుంబ సభ్యుల సమ్మతితో బుధవారం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆ మహిళకు
ఆపరేషన్ చేసి సుమారు 6 కిలోల బరువున్న 30×30 సెంటిమీటర్లు కలిగిన కణతిని తొలగించారు.
ఈ అరుదైన శాస్త్ర చికిత్సలో సర్జన్ల బృందం డాక్టర్ శ్రీకాంత్ వర్మ, డాక్టర్ నిఖిత ,డాక్టర్ వంశీ, డాక్టర్ దివ్య, అనస్తీషియా బృందం డాక్టర్ బద్రి నారాయణ ,డాక్టర్ నవీన్, డాక్టర్ సుధా, డాక్టర్ గిరి, డాక్టర్ శ్వేత లు సుమారు నాలుగైదు గంటల పాటు శ్రమించి ఈ కణతిని తొలగించారు.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యంత అదునాతన వైద్య పరికరాలు ,వైద్య సదుపాయాలు,డాక్టర్లు ఉన్నందున ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించగలుగుతున్నామని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ అరుణకుమారి తెలిపారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసిన డాక్టర్ల బృందాన్ని ఆమె అభినందించారు.
MOST READ :
-
Obesity : ఉబకాయం సమస్యకు ఇక చెక్.. చికిత్సలో నూతన ఆవిష్కరణలు..!
-
Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!
-
Youth: అప్పు చేసి పప్పు కూడు కు స్వస్తి.. వ్యక్తిగత రుణాలపై ఆసక్తి తగ్గుదల..!
-
Students : ఇంటర్ చదివే విద్యార్థులు.. లక్షల రూపాయలు వారికి ఎక్కడివి.. కట్ చేస్తే పోలీసుల అదుపులో..!









