Nalgonda : ఆరుగురు ఏఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి..!
Nalgonda : ఆరుగురు ఏఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి..!
నల్లగొండ, మన సాక్షి :
పదోన్నతి పొందిన ఎస్.ఐలకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు.
శుక్రవారంజిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆరుగురు ఏఎస్ఐ లకు, ఎస్.ఐలుగా పదోన్నతి పొందిన సందర్బంగా జిల్లా ఎస్పీ స్టార్ లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని,పోలీసు స్టేషనుకు వచ్చే పిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడుతూ సమస్యను పరిష్కరించే దిశగా పని చేస్తూ తమకు అప్పగించిన విధులను క్రమ శిక్షణతో బాధ్యతతో పని చేయాలని అన్నారు.అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందన అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సంఘం అధ్యక్షుడు జయ రాజు పదోన్నతి పొందిన ఎస్.ఐ లు తదితరున్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ రైతులకు భారీ శుభవార్త.. అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..!
-
National Highway : జాతీయ రహదారిపైనే భారీ పార్కింగ్.. ఎవరికి పట్టదా..!
-
Uttarakhand : అలకనంద నదిలో బస్సు బోల్తా.. 10 మంది గల్లంతు..!
-
ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!
-
Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!









